Begin typing your search above and press return to search.
సంక్రాంతి పందెంలో థియేటర్ గేమ్
By: Tupaki Desk | 25 Oct 2019 5:43 AM GMTసినిమాలు తీయడం ఒకెత్తు.. వాటిని రిలీజ్ చేయడం ఇంకో ఎత్తు. ఫిలింమేకర్స్ కి మొదటిది చాలా సులువు. రెండోదే ఓ పెద్ద ఫజిల్. థియేటర్ల కోసం వెతుకులాటలో అసలు సిసలు అనుభవాలు ఎదురవుతాయి. ఎంత గొప్ప సినిమా తీసినా రిలీజ్ చేయాలంటే అందుకు ఎవరో ఒకరిని కలవాలి. థియేటర్లు ఉన్న వారితో మాటా మంతీ సాగించే నైపుణ్యం కావాలి. అందుకోసం అవసరం మేర రెంటల్స్ `పే` చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఏపీ-తెలంగాణలో నడుస్తున్న థియేటర్ల గేమ్ ఇది.
సినిమాలు రిలీజ్ చేయాలంటే థియేటర్లకు- నిర్మాతకు మధ్య ఎవరుంటారు? అంటే... కచ్ఛితంగా అప్పటికే థియేటర్ల రంగంలో కర్ఛీఫ్ వేసిన కొందరుంటారు. సినిమా తీసి వాళ్లకు అప్పగించాల్సిందే. అయితే 2020 సంక్రాంతికి 2019 డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా వస్తున్న సినిమాల్ని ఎవరికి అప్పగించాలి? అంటే కచ్ఛితంగా థియేటర్ల వద్ద గేమ్ ప్లేయర్స్ ఎవరుంటారో వాళ్లకు అప్పగించాల్సిందే. ఈ నిజం తెలిసీ కొందరు మ్యానేజ్ చేస్తారు. చాలా మంది కొత్త నిర్మాతలు తెలియక సినిమాలు తీస్తుంటారు. కొత్త నిర్మాతలు .. మంచి నిర్మాతలు ఎందుకు సినిమాలు తీస్తున్నారు అంటే అది వాళ్ల విజ్ఞత.
2020 సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన భారీ సినిమాల్ని కొనుక్కున్న అగ్ర నిర్మాత దిల్ రాజు ఇప్పటి నుంచే థియేటర్లను పూర్తిగా తన స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నారన్నది తాజా సమాచారం. రూ.30కోట్లు వెచ్చించి `అల వైకుంఠపురములో` వంటి భారీ చిత్రాన్ని కొనుక్కున్న ఆయన ఉత్తరాంధ్ర-నైజాంలో భారీగా రిలీజ్ చేస్తున్నారు. నైజాం-20కోట్లు.. విశాఖ -10 కోట్లకు కొనుక్కురట. అయితే ఇంత పెద్ద మొత్తాల్ని వేరే సంస్థలు ఆఫర్ చేసినా ససేమిరా అంటూ దిల్ రాజుకే రైట్స్ కట్టబెట్టడం వెనక చాలా పెద్ద గేమ్ ప్లే అయ్యిందట. నిరంతరం థియేటర్లు గుప్పిట్లో ఉండే దిల్ రాజును కాదని వేరొకరికి ఇవ్వడం కుదరలేదుట. డిసెంబర్ లో రిలీజయ్యే `ప్రతి రోజు పండగే` చిత్రాన్ని ఆయనకే వైజాగ్ హక్కులు రెండున్నర కోట్లకు కట్టబెట్టారట. అంతకుమించి ఆఫర్ చేసేవాళ్లు ఉన్నా రాజుగారి ఖాతాలోనే పడిందంటే దానికి కారణం థియేటర్లు ఆయన చేతిలో ఉండడమే. ఇప్పటికే సంక్రాంతి బరిలో రిలీజ్ కి రెడీ అవుతున్న సరిలేరు నీకెవ్వరు- దర్బార్ చిత్రాలు కూడా దిల్ రాజు చేతిలోనే ఉన్నాయి. వీటిని నైజాం - ఉత్తరాంధ్ర ఆయనే భారీగా రిలీజ్ చేస్తారట. అందుకు తగ్గట్టే ఆ రెండు చోట్లా థియేటర్లను ఆయన కొనేసారన్న మాట వినిపిస్తోంది. సినిమా అనేది వ్యాపారం. ఇక్కడ ముందుగా ఎవరు పాచికలు విసురుతారో వాళ్లదే ఆట. ఇది డబ్బుతో ఆడే ఆట.. సత్సంబంధాలతో నడిచే ప్లే కాబట్టి.. సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన హవా అలా సాగుతోందని విశ్లేషిస్తున్నారు. ఆయన్ని కాదంటే ఏమవుతుందో అనే భయం బెంగ చిన్నవాళ్లలో ఉంటుందన్నది మరో అన్ వాంటెడ్ యాంగిల్!