Begin typing your search above and press return to search.
థగ్స్ దోపిడి నుండి మమ్ముల రక్షించండి!
By: Tupaki Desk | 20 Nov 2018 2:30 PM GMTబాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ - బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన సినిమా అనగానే అంచనాలు ఒక్కసారిగా ఆకాశానికి పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ చిత్రం ఉంటుందని, ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తున్నందుకు ఈ చిత్రం ఆ స్థాయి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుందనే నమ్మకంను చిత్ర యూనిట్ సభ్యులు కలిగించారు. 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంను అంతకు మించి థియేట్రికల్ రైట్స్ అమ్మినట్లుగా సమాచారం అందుతోంది.
భారీ అంచనాల నడము విడుదలైన ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ చిత్రం ఈ సంవత్సరపు అతి పెద్ద డిజాస్టర్ ఆఫ్ బాలీవుడ్ అంటూ పేరు తెచ్చుకుంది. మొదటి షో నుండే నెగటివ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో బుక్ చేసుకున్న వారు కూడా టైం వేస్ట్ సినిమా అంటూ సినిమాకు వెళ్లలేదట. అంతటి చెత్త టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు నిండా ముగిని పోయారు. పెట్టిన పెట్టుబడిలో కనీసం 40 శాతం కూడా రాలేదు అంటూ డిస్ట్రిబ్యూటర్లు మరియు థియేటర్ల యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
థగ్స్ దోపిడికి గురైన తమను యాష్ రాజ్ ఫిల్మ్స్ వారు తమను ఆదుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు మరియు థియేటర్ల యాజమాన్యం డిమాండ్ చేస్తున్నారు. 60 శాతం నష్టాల్లో కనీసం 40 శాతం అయినా భరించాలని వారు నిర్మాతలకు మొర పెట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కొందరు అమీర్ ఖాన్ ను మరి కొందరు అమితాబచ్చన్ ను కూడా వేడుకుంటున్నారట. గతంలో కొన్ని ఇలాంటి అట్టర్ ఫ్లాప్ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లను ఆదుకున్నారు. షారుఖ్ మరియు సల్మాన్ ఖాన్ లు అప్పట్లో ఆదుకున్నారు. అలాగే ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా ఆదుకోవాలంటూ బయ్యర్లు కోరుతున్నారు. మరి మిస్టర్ పర్ ఫెక్ట్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.