Begin typing your search above and press return to search.

థియేట‌ర్..ఓటీటీ విభ‌జ‌న‌ని త‌ప్పు బ‌ట్టిన నిర్మాత‌!

By:  Tupaki Desk   |   23 Nov 2022 2:30 AM GMT
థియేట‌ర్..ఓటీటీ విభ‌జ‌న‌ని త‌ప్పు బ‌ట్టిన నిర్మాత‌!
X
క‌మ‌ర్శియల్ సినిమాలు థియేట‌ర్లో...క‌ళాత్మ‌క సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేసుకోవాలంటూ కొన్ని వాద‌న‌లు తెర‌పైకి వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. రెండు జాన‌ర్ సినిమాల్ని వేరు చేసి కొన్ని సినిమాలుకు ఓటీటీ ఉత్త‌మం అని చాలా మంది నిర్మాత‌లు సైతం భావిస్తున్నారు. ఆర్ట్ సినిమాల్ని నేరుగా థియేట‌ర్ లోరిలీజ్ చేస్తే చూసే ప‌రిస్థితి ఉండ‌దు..ఓటీటీ అమ్ముకుంటే కొంత లాభాలతోనైనా బ‌య‌ట ప‌డొచ్చు! అన్న ఉద్దేశం కొంత మంది నిర్మాత‌ల్లో ఉంది.

అయితే ఈ విధానంపై బాలీవుడ్ ద‌ర్శ‌క‌-నిర్మాత క‌ర‌ణ్ జోహార త‌ప్పుబ‌ట్టారు. ఇది చాలా త‌ప్పుడు భావ‌న‌ని అని అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. సినిమా అనేది ఎప్పుడూ ఒక్క‌టే. రెండుగా వేరు చేసి చూడ‌టం అన్న‌ది చాలా త‌ప్పు. ఇది మ‌న‌కు మ‌నం సృష్టించుకున్న‌దే. కొన్ని ఓటీటీల‌కు విస్తార‌మైన నెట్ వ‌ర్క్ ఉంది. వీటితో అత్య‌ధిక‌మంది ప్రేక్ష‌కుల‌కు చేరువ కావొచ్చు.

డీస్నీ హాట్ స్టార్ ద్వారా మా సినిమా 'గోవింద్ నామ్ మేరా'కి మంచి ప్లాట్ ఫాం దొర‌కింది. అలాంటిది కాకుండా చిన్న ఓటీటీ ప్లాట్ ఫాంలో సినిమా రిలీజ్ చేస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుంది? అంతా పెద్ద ఓటీటీలోనే సినిమా రిలీజ్ చేసే ప‌రిస్థితి ఉండ‌దు. సినిమా అమ్మేసి చేతులు దులుపుకున్నా? త‌ర్వాత కొన్న వారు న‌ష్టాలు చూడాలి. అస‌లు సినిమాని రెండు విధాలుగా చూడ‌టం పెద్ద త‌ప్పు.

ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వారు సినిమా రిలీజ్ చేసుకోవ‌చ్చు. థియేట‌ర్ రిలీజ్..ఓటీటీ రిలీజ్ అనేది వాళ్ల సామార్ద్యాన్ని బ‌ట్టి ఉంటుంది అన్నారు. క‌ర‌ణ్ వ్యాఖ్య‌ల‌కు కొంత‌మంది నెటిజ‌న్లు మ‌ద్ద‌తు ప‌లుకున్నారు. అన్ని ర‌కాల సినిమాలు ప్రేక్ష‌కుల‌కు చేరువ అవ్వాలి. అలా చేయాల్సిన బాద్య‌త ప‌రిశ్ర‌మ‌ల‌పై ఉంది. ప‌రిశ్ర‌మ‌నే సినిమాని రెండు కోణాళ్లో చూస్తూ మ‌నుగ‌డ‌కే ముప్పొస్తుంది.

ద‌య‌చేసి క‌ళామాత‌ల్లిని వేరు చేయోద్దంటూ రిక్వెల‌స్ట్ లు పెడుతున్నారు. సినిమా బాగుంటే ఎక్క‌డైనా ఆడుతుంది. థియేట‌ర్ రిలీజ్ అయితే మ‌రింత రీచ్ ఉంటుంది. సినిమాల‌కి కేవ‌లం థియేట‌ర్లు మాత్ర‌మే బెస్ట్ ఎక్స్ పీరియ‌న్స్ అందించ‌గ‌ల‌వ‌ని మెజాట‌ర్టీ వ‌ర్గం భావిస్తుంది. స్మార్ట్ ఫోన్ లో ఎంట‌ర్ టైన్ మెంట్ కొన్నాళ్ల‌కి బోర్ కొడుతుంద‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.