Begin typing your search above and press return to search.

ధనలక్ష్మి..కీ అదే దెబ్బ పడింది

By:  Tupaki Desk   |   5 Aug 2015 2:13 PM GMT
ధనలక్ష్మి..కీ అదే దెబ్బ పడింది
X
ఈ రోజుల్లో సినిమాలు తీయడం పెద్ద విషయం కాదు. వాటిని సజావుగా విడుదల చేసుకోవడం.. చాలినన్ని థియేటర్లు దక్కేలా చూసుకోవడమే ముఖ్యం. దీనికి ఎవరు బాధ్యులు అన్న సంగతి పక్కనబెడితే.. టాలీవుడ్ లో థియేటర్ల మాయాజాలం పుణ్యమా అని కొన్ని మంచి సినిమాలు కూడా చచ్చిపోతుండటం విచారించాల్సిన విషయం.

బాహుబలి సినిమా విడుదలకు ముందు వారం ఒకేసారి ఐదారు సినిమాలు రిలీజయయ్యాయి తెలుగులో. అందులో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఏకైక సినిమా సూపర్ స్టార్ కిడ్నాప్. కానీ దారుణమైన విషయం ఏంటంటే.. ఆ సినిమా గురించి జనాలకు తెలియలేదు. తెలిసినా సినిమా చూద్దామంటే దగ్గర థియేటర్ల లో కనిపించలేదు. హైదరాబాద్ అంతా కలిపి మూడో నాలుగో థియేటర్లిచ్చారు. కానీ చెత్త సినిమా అని పేరు తెచ్చుకున్న ‘బస్తీ’కి బోలెడన్ని థియేటర్లు దొరికాయి. టాక్ ఏంటో తెలిశాక కూడా అలాంటి సినిమాల్ని బాగానే నడిపించారు. సూపర్ స్టార్ కిడ్నాప్ మాత్రం అన్యాయమైపోయి.. చరిత్రలో కలిసిపోయింది.

ఇప్పుడు ‘ధనలక్ష్మి తలుపు తడితే’ సినిమా పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. వచ్చేవారం శ్రీమంతుడు షెడ్యూలై ఉండటంతో ఈ వారం ఓ మోస్తరు సినిమా కూడా ఏదీ రాలేదు. ఉన్నంతలో ‘ధనలక్ష్మి తలుపు తడితే’ చెప్పుకోదగ్గ సినిమా. సినిమాకు మంచి టాక్ కూడా వచ్చింది. కానీ ఏం లాభం.. ఆ సినిమాకు థియేటర్లివ్వలేదు. హైదరాబాద్ అంతా కలిపి ఆరేడు థియేటర్లలో అది కూడా తక్కువ షోలిచ్చారు. దీంతో జనాలు సినిమా చూద్దామన్నా దగ్గర్లో లేని పరిస్థితి. ఛాన్స్ ఉన్నదే ఒక్క వారం అంటే.. అందులోనూ తక్కువ థియేటర్ లిస్తే ఏం చేయాలి. పాపం ధనరాజ్.. తన కష్టార్జితాన్నంతా ఈ సినిమాలో పెట్టాడు. కానీ పెద్దగా డబ్బులు తిరిగి రాలేదు.