Begin typing your search above and press return to search.

మంచోడికే ముందే ఇలాంటి క‌ష్టమా?

By:  Tupaki Desk   |   14 Jan 2020 7:13 AM GMT
మంచోడికే ముందే ఇలాంటి క‌ష్టమా?
X
పండ‌గ‌ల వేళ థియేట‌ర్ల గేమ్ గురించి తెలిసిందే. స‌రైన‌ టైమ్ చూసి ఆ న‌లుగురు గుప్పిట ప‌ట్టి ఆటాడిస్తార‌న్న వాద‌న చాలా కాలంగా ఉంది. థియేట‌ర్ల‌ను ఎప్పుడు లాక్ చేయాలి? ఎప్పుడు వ‌ద‌లాలి? అన్న‌ది ఆ న‌లుగురికే తెలిసిన మంత్రం. ఇక ఆ నలుగ‌రిలో దిల్ రాజు ఒక‌ర‌న్న‌ది విధిత‌మే. పంపిణీదారుడిగా.. ఎగ్జిబిట‌ర్ గా రాజుగారి అనుభ‌వ చాణ‌క్యం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇంతింతై వ‌టుడింతై అన్న చందంగా ప‌రిశ్ర‌మ‌లో రాజుగారు ఎదిగారు. నిర్మాత‌గా రాణిస్తూనే పంపిణీ రంగంలోనూ స‌త్తా చాటుతున్నారు. అందుకే ఏ హీరో సినిమా రిలీజ‌వ్వాల‌న్నా! ఆయ‌న‌ను సంప్ర‌దించాలి. ఆయ‌న‌కే అమ్మాలి. కంటెంట్ న‌చ్చితే ఆయ‌న రిలీజ్ చేస్తారు... మ‌రీ న‌చ్చితే రైట్స్ కొనుక్కొని రిలీజ్ చేస్తారు. రాజుగారి మెయిన్ బిజినెస్ ఇది.

ఇక కీల‌క‌మైన వైజాగ్- ఉత్త‌రాంధ్ర‌లో థియేట‌ర్లు అన్ని రాజుగారి చేతిలోనే ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న క‌నుస‌న్న‌లోనే థియేట‌ర్ల వ్య‌వ‌హారం న‌డుస్తూ ఉంటుంది. ఇటీవ‌లే ద‌ర్బార్ చిత్రాన్ని ఆయ‌నే రిలీజ్ చేసారు. తొలి రెండు మూడు రోజులు ద‌ర్బార్ కు మంచి వ‌సూళ్లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఇంకా కొన్ని థియేట‌ర్ల‌లో ద‌ర్బార్ ర‌న్ అవుతోంది. ఇప్పుడా ప్ర‌భావం `ఎంత మంచివాడ‌వురా` సినిమాపై ప‌డింద‌ట‌. ఎంత‌మంచి వాడ‌వురా ఉత్త‌రాంధ్ర రిలీజ్ రైట్స్ రాజు గారికి ఇవ్వ‌క‌పోవ‌డంతో మంచోడికి రిలీజ్ కు ముందే క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఉత్త‌రాంధ్రాలో ఎంత మంచివాడ‌వురా కు కేవ‌లం 15 థియేట‌ర్లు మాత్ర‌మే దొరికాయట‌.

ద‌ర్బార్ ఇంకా ఆ మూడు జిల్లాల్లో 20 థియేట‌ర్ల‌ల‌లో ఆడుతోంది. దానికి కార‌ణం రాజుగారేన‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ద‌ర్బార్ ని తొల‌గించే స‌న్నివేశం లేద‌ట‌. దీంతో మంచివాడికి రిలీజ్ కు ముందు క‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌ట‌. వాస్త‌వానికి ఇలా చేయ‌డం వ‌ల్ల థియేట‌ర్ల వాళ్ల‌కు క‌లిసొచ్చేదేమీ ఉండ‌ద‌ని అంటున్నారు. ద‌ర్బార్ కి ఆ ఏరియాలో అంత‌గా క‌లెక్ష‌న్స్ లేవు. క‌నీసం పార్కింగ్....క్యాంటీన్ ఆదాయం కూడా ద‌క్క‌ని ప‌రిస్థితి. కానీ రాజుగారిని కాద‌ని ఖాళీ చేయ‌లేని ప‌రిస్థితి. అన్ని ఏరియాలు రాజుగారికి క‌ట్ట‌బెట్టి ఉంటే ఈ స‌మ‌స్య త‌లెత్తేది కాదని.. బ‌య‌ట కంపెనీ పంపిణీ చేస్తే ఇలాంటి చిక్కులే ఉంటాయ‌ని విశ్లేషిస్తున్నారు. ఇలాంటి వ్య‌వ‌హారాల‌కు చెక్ పెట్టేలాగా.. డ‌బ్బింగుల కంటే స్ట్రెయిట్ సినిమాకే ప్రాధాన్య‌త‌నిచ్చేలా ఏదైనా కొత్త చ‌ట్టం తెస్తే బావుండున‌ని కొంద‌రు అంటున్నారు. పంపిణీవ‌ర్గాలు- ఎగ్జిబిట‌ర్లు -నిర్మాతలు క‌లిసిక‌ట్టుగా ప్ర‌యత్నిస్తే క‌ష్ట‌మేమీ కాదు. అప్పుడే అంద‌రూ సంతోషంగా ఉండ‌గ‌ల‌రు. తెలుగు సినిమా బ‌త‌క‌డం సాధ్య‌మ‌వుతుంది.