Begin typing your search above and press return to search.

ఆగస్ట్ 11 థియేటర్ల కోసం రచ్చ

By:  Tupaki Desk   |   9 July 2017 5:13 AM GMT
ఆగస్ట్ 11 థియేటర్ల కోసం రచ్చ
X
లాంగ్ వీకెండ్ రావడం.. ఐదు రోజుల పాటు వసూళ్లు సాధించే అవకాశం ఉండడంతో.. టాలీవుడ్ పలు క్రేజీ ప్రాజెక్టులు ఆగస్ట్ 11కు వచ్చేస్తున్నాయి. నితిన్ నటించిన లై.. రానా మూవీ నేనే రాజు నేనే మంత్రి.. బోయపాటి రూపొందించిన జయ జానకి నాయక.. చిత్రాలు ఆగస్ట్ 11కు రిలీజ్ కానున్నాయి.

మీడియం బడ్జెట్ మూవీస్ కావడంతో.. ఈ సినిమాలకు థియేటర్లు దొరకడం సమస్య కాదు. కానీ అఆ మూవీతో నితిన్ రేంజ్ మారింది. స్టార్ హీరో రేంజ్ వైపు అడుగులు పడ్డాయి. బాహుబలిలో భల్లాలదేవుడిగా రానా బోలెడంత క్రేజ్ సంపాదించేశాడు. అందుకే ఈ సినిమా మూడు భాషల్లో అనువాదం అవుతోంది. అదే ఇప్పుడు థియేటర్లకు ఇబ్బంది తెస్తోంది. పోటీ ఎక్కువగా ఉండడంతో.. థియేటర్లను బ్లాక్ చేసుకుంటున్నారు ప్రొడ్యూసర్లు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. నితిన్ కు తెలంగాణలో ఎక్కువ థియేటర్లు దక్కుతుండగా.. రానాకు ఏపీలో పెద్ద సంఖ్యలోనే స్క్రీన్స్ కేటాయించనున్నారట. అయితే.. డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం వేరేలా కోరుకుంటుండడం విశేషం.మాస్ పల్స్ పక్కాగా తెలసిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన జయ జానకి నాయకకు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారట డిస్ట్రిబ్యూటర్లు.

సినిమా టాక్ వచ్చాక థియేటర్లు కేటాయించే ట్రెండ్ ఇప్పడు లేదు. సినిమా సక్సెస్ రేంజ్ ను మొదటి వీకెండ్ కలెక్షన్స్ డిసైడ్ చేసేస్తున్నాయి. మరి ఈ మూడు సినిమాలకు థియేటర్లను కేటాయించడం ఇబ్బందే అంటున్నారు ట్రేడ్ జనాలు. మల్టీప్లెక్స్ లలో ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. సింగిల్ స్క్రీన్స్ లో పంపకాలు కాసింత కష్టం కావచ్చట. మరోవైపు ఈ 3 సినిమాలు కాకుండా.. ఇంకో సినిమా ఏదైనా లైన్ లోకి వస్తే మాత్రం సిట్యుయేషన్ మరింత క్రిటికల్ అవుతుందని సినిమా జనాల వాదన.