Begin typing your search above and press return to search.
థియేటర్లో టీజరు కే త్రీడీ గ్లాస్ ఇస్తున్నారు!
By: Tupaki Desk | 14 Sep 2018 6:33 AM GMTత్రీడీ సినిమాకు వెళితే.. హాల్లోకి వెళుతున్నప్పుడు త్రీడీ గ్లాస్ చేతికి ఇస్తుంటారు. శంకర్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన రోబో 2.0 టీజర్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 9 గంటల వేళ విడుదల చేసిన ఈ టీజర్ ను థియేటర్లలోనూ ప్రదర్శిస్తున్నారు.
ఈ త్రీడీ టీజర్ కోసం థియేటర్లలో ప్రత్యేకంగా త్రీడీ గ్లాసులు ఇస్తున్నారు. ఏదో సినిమాకు బుక్ చేసుకొని థియేటర్ లోపలకు వెళుతున్న వేళ.. త్రీడీ గ్లాస్ చేతిలో పెట్టటంతో సర్ ప్రైజ్ అవుతూ కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రేక్షకులు. మేం వచ్చింది త్రీడీ మూవీకి కాదుగా అంటుంటే.. లేదండి.. రోబో 2.0 టీజర్ ఉంది. దాని కోసం ఈ గ్లాసెస్ అని బదులిస్తున్నారు.
త్రీడీ సినిమాకు గ్లాసెస్ ఇవ్వటం కామన్. కానీ.. ఒక సినిమా టీజర్ కోసం త్రీడీ గ్లాస్ చేతికి ఇవ్వటం మాత్రం కొత్తే. ఇది సరికొత్త అనుభూతిగా పలువురు అభివర్ణిస్తున్నారు.దీంతో.. 2.0 టీజర్ ఎప్పుడు వస్తుందన్న ఆసక్తిని రేకెత్తించేలా చేశారు. సినిమా స్టార్ట్ కావటానికి ముందు.. అంటే చివరి యాడ్ గా 2.0 టీజర్ ప్రదర్శిస్తున్నారు.
చేతిలో త్రీడీ గ్లాస్ పెట్టటం ద్వారా శంకర్ తన టీజర్ మీద ప్రేక్షకులు ఫుల్ అటెన్షన్ చూపేలా చేశారని చెప్పక తప్పదు. మొత్తానికి తన టీజర్ తో శంకర్ తనదైన సర్ ప్రైజ్ ను ఇచ్చారని చెప్పక తప్పదు.