Begin typing your search above and press return to search.
క్షణం పోస్టర్లో ఇంత విషయముందా?
By: Tupaki Desk | 24 Feb 2016 4:24 PM GMTసినిమాలకే ఓ కాన్సెప్ట్ అంటూ ఉండట్లేదు. అలాంటిది టైటిల్ లోగో గురించి పట్టించుకునేదెక్కడ. ఐతే ఓ చిన్న సినిమా యూనిట్ మాత్రం లోగో విషయంలో చాలా శ్రద్ధ పెట్టింది. ఆ సినిమానే క్షణం. మామూలుగా క్షణం టైటిల్ లోగో చూస్తే ఏమీ అనిపించదు. కానీ కాస్త శ్రద్ధ పెడితే.. ఈ సినిమా కాన్సెప్ట్ అంతా ఈ లోగోలోనే దాగి ఉన్న సంగతి బయటపడుతుంది.
టైటిల్ కింద ముందుగా అత్యాధునికంగా కనిపించే బిల్డింగులుంటాయి కదా. అవి అమెరికాను ఇండికేట్ చేస్తాయి. ఆ తర్వాత ఛార్మినార్ కనిపిస్తుంది. అది హైదరాబాద్ కు ఇండికేషన్. ఇక చివరికి వచ్చేసరికి ఓ పాప కనిపిస్తుంది. ఈ సినిమా అంతా తిరిగేది ఆ పాప చుట్టూనే.
ఈ పాప కోసం హీరో అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చి అన్వేషణ సాగిస్తాడన్నమాట. ఇదీ ఈ సినిమా కాన్సెప్ట్. క్షణం టైటిల్ లోగో వెనుక ఇంత కాన్సెప్ట్ ఉందన్నమాట. బాగుంది కదా.. క్షణం టీం ప్రయత్నం. అనిల్ భాను అనే పబ్లిసిటీ డిజైనర్ ఈ పోస్టర్ రూపొందించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర్నుంచి డిఫరెంట్ ప్రోమోస్ తో ఆసక్తి రేపుతున్న క్షణం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అడివి శేష్ - ఆదా శర్మ - అనసూయ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రవికాంత్ పేరెపు దర్శకుడు. పీవీపీ సంస్థ నిర్మించింది.ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు స్క్రీన్ ప్లే సహకారం కూడా అందించాడు శేష్.