Begin typing your search above and press return to search.
దీనికి కూడా అదే ప్రచారం.. అదే రచ్చేనా??
By: Tupaki Desk | 3 April 2020 10:30 AM GMTకరోనా వైరస్ కారణంగా భారతదేశం గత కొన్ని రోజులుగా లాక్ డౌన్లో ఉంది. దీంతో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే కూర్చున్నారు. సూపర్ స్టార్ల నుంచి సూపర్ కాని.. స్టార్లు కాని సాధారణ మనిషి వరకు అందరూ ఇంట్లోనే మకాం. సినిమా థియేటర్లు లేకపోవడంతో కొత్త సినిమాల రిలీజ్ లు లేవు.. రివ్యూలు అంతకన్నా లేవు.. కలెక్షన్ లేనప్పుడు ఇక ఫేక్ కలెక్షన్ల భాగోతం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? దీంతో కొన్ని సినిమా టీమ్ లకు టైం పాస్ కావడం లేదు.
సాధారణంగా అయితే ఆ వీడియో కు మిలియన్ వ్యూస్ వచ్చాయని.. ఈ వీడియో కు 10 మిలియన్ లు వచ్చాయని..10 కోట్లు కలెక్షన్ వస్తే 50 కోట్లు వచ్చిందని.. ఏదో ఒక సోది తో పిచ్చ ప్రచారాలు చేసేవారు. ఇప్పుడు అవేవీ లేకపోవడంతో.. టీవీలో వచ్చే టీఆర్పీ లకు బాజాభజంత్రీలు గట్టిగా వాయిస్తున్నారు. 80 శాతానికి పైగా ప్రజలు ఇంటిపట్టున ఉన్నప్పుడు.. వాళ్లు టీవీ చూడక ఏం చేస్తారు.. టిఆర్పి రేటింగులు రాకుండా పోతాయా? అందర్నీ ఇళ్లలో బంధించి ఉన్నప్పుడు వచ్చే టిఆర్పి రేటింగులు.. సాధారణ సమయంలో వచ్చే టిఆర్పి రేటింగ్ లతో పోల్చి చూడడం సరైన పోలికే కాదు. అవతార్.. అవెంజర్ సినిమా బడ్జెట్ లు.. కలెక్షన్లతో మన సినిమాలను పోల్చడం లాంటిదే ఈ వ్యవహారం. ఈ టైంలో కొత్త సినిమాలు ఏవి ప్రసారం చేసినా వాటికి అదిరిపోయే టిఆర్పి రేటింగులు వస్తాయి.. వాటిని తమ సినిమా సత్తా అనుకోవడం కంటే పిచ్చితనం ఇంకొకటి లేదు.
అసలే జనాలు కొత్త కంటెంట్ లేక మొహం వాచిపోయి ఉన్నారు. ఈ సమయంలో ఏ సినిమా వేసినా వాటికి భారీ వ్యూయర్ షిప్ దక్కడం అనేది సాధారణం. ఇంత మాత్రానికి అదేదో ఘనత సాధించినట్టు డప్పు కొట్టుకోవడం పై సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రోలింగ్ మొదలైంది. ఏదో ఒక దానికి ప్రచారం చేసుకోవడం.. డప్పు కొట్టుకోవడం అలవాటయిన కొందరు సినిమా జనాలు ఇప్పుడు కూడా అదే చేయడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.