Begin typing your search above and press return to search.
అప్పుడు సూర్య 'గజిని'.. ఇప్పుడు ధనుష్..!
By: Tupaki Desk | 14 Sep 2022 11:25 AM GMTగత కొన్నేళ్ల క్రితం సూర్య హీరోగా నటించిన మూవీ 'గజిని'. ఈ మూవీని ముందు తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రీమేక్ చేయాలనుకున్నారు. అయితే సూర్యక ఇది తన కెరీర్ ని తమిళంతో పాటు తెలుగులోనూ కీలక మలుపు తిప్పే సినిమా అని అందుకు అంగీకరించలేదు.
గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ని రిక్వెస్ట్ చేసుకున్నాడు. దీంతో ఈ మూవీని స్వయంగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గానే తొలిసారి గీతా ఆర్ట్స్ బ్యానర్ పై డబ్బింగ్ సినిమాని తెలుగులో రిలీజ్ చేసి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
హీరో సూర్య ఈ మూవీతో తెలుగులో పాపులర్ అయిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్లకు గీతా ఆర్ట్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ధనుష్ నటించిన సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో కలైపులి ఎస్. ధాను.. ధనుష్ హీరోగా రూపొందిన తమిళ సినిమా 'నానే వరువేన్'. ఇదే మూవీని తెలుగులో 'నేనే వస్తున్నా' అనే పేరుతో నిర్మాత కలైపులి ఎస్. ధానుతో కలిసి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు.
సెల్వరాఘవన్ - ధనుష్ ల కలయికలో కాదల్ కొండేన్, పుదు పెట్టై, మయక్కం ఎన్న వంటి సినిమాల తరువాత వస్తున్న నాలుగవ ప్రాజెక్ట్ ఇది. అంతే కాకుండా చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సెల్వరాఘవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకులు ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తిని కనబరుస్తున్నారు. రీసెంట్ గా ధనుష్ నటించిన 'తిరు' మూవీ రూ. 100 కోట్లు వసూళ్లని రాబట్టడంతో తెలుగులో ఈ మూవీపై క్రేజ్ భారీగా పెరిగింది.
ఇక ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ తో సినిమాపై తమిళ, తెలుగు భాషల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎల్లీ అవ్రమ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. 2005లో వచ్చిన సూర్య 'గజిని' బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ ఇన్నేళ్లకు ధనుష్ మూవీని గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేస్తుండటంతో ఆ సెంటిమెంట్ ఈ మూవీకి కూడా వర్కవుట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
సెప్టెంబర్ 29న తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో కలిసి చిత్ర నిర్మాత కలైపులి ఎస్. ధాను కలిసి వున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో యోగిబాబు, ఇందుజా రవిచంద్రన్ నటించగా సంగీతం యువన్ శంకర్ రాజా అందించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.