Begin typing your search above and press return to search.
అప్పుడు యష్ ఫ్యాన్స్ .. ఇప్పడు విజయ్ ఫ్యాన్స్
By: Tupaki Desk | 29 March 2022 4:30 PM GMTక్రేజీ హీరో నటించిన సినిమా కు ప్రాపర్ ప్రమోషన్స్ చేయడం లేదని, రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్నా ఇంత వరకు మేకర్స్ ప్రమోషన్స్ ని ప్రారంభించడం లేదని రాకింగ్ స్టార్ యష్ అభిమానులు `కేజీఎఫ్ చాప్టర్ 2` ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ పై ఆరోపణలు చేసి అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే తరహా లో తమిళ స్టార్ హీరో ఇళయదళపతి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట. వివరాల్లోకి వెళితే.. `మాస్టర్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత విజయ్ నటిస్తున్న చిత్రం `బీస్ట్`.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. పూజా హెట్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 13న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. రిలీజ్ కి 15 రోజులు అంటే దాదాపుగా రెండు వారాలు మాత్రమే వుండటంతో మేకర్స్ నుంచి ఎలాంటి ప్రచార కార్యక్రమాలు ప్రారంభం కాలేదు.
టైమ్ దగ్గరపడుతున్నా మేకర్స్ ఇంకా ప్రమోషన్స్ ని ప్రారంభించకపోవడం ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట. అనిరుధ్ సంగీతం అందించిన ఈ మూవీ లిరికల్ వీడియోలు ఇప్పటికే నెట్టింట సందడి చేస్తున్నాయి.
యూట్యూబ్ లో వైరల్ అవుతున్నారు. అరబ్బిక్కుత్తూ.. జొల్లి ఓ జింఖానా.. అంటూ సాగే లిరికల్ వీడియోలని రీసెంట్ గా విడుదల చేశారు. అవి ఇప్పడు ట్రెండింగ్ లో వున్నాయి. ఈ మూవీని తెలుగులో దిల్ రాజు, డి. సురేష్ బాబు, సునీల్ కె నారంగ్ సంయుక్తంగా విడుదల చేస్తున్నారు.
అయితే తమిళ్ తో పాటు తెలుగులోనూ `బీస్ట్` ప్రమోషన్స్ నత్తనడకన సాగుతుండటం విజయ్ అబిమానుల్ని టెన్షన్ కు గురిచేస్తోందట. ఇప్పుడిప్పుడే తెలుగులో విజయ్ కి చాలా ఏళ్ల తరువాత మంచి మార్కెట్ క్రియేట్ అవుతూ అతని సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతోంది ఈ నేపథ్యంలో సరైన ప్రమోషన్స్ ని మేకర్స్ ఇంకా స్టార్ట్ చేయడం లేదని ఫ్యాన్స్ ఫలవుతున్నారట. మేకర్స్ సన్ టీవీ అధినేతలు కావడంతో టీవీ షోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దీంతో ప్రమయోషన్స్ అయిపోయినట్టే అనబోతున్నారట.
ఇది విజయ్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదని, ప్రమోషన్స్ అంటే టీవీ షోస్ కాదని, ప్రీ రిలీజ్ ఈ వెంట్స్, మీడియా ప్రెస్ మీట్స్ వుండాలని అలా చేస్తేనే సినిమా మరింత మందికి రీచ్ అవుతుందని చెబుతున్నారట. కానీ సన్ పిక్చర్స్ వారు వాత్రం `బీస్ట్` ప్రమోషన్స్ కోసం టీవీ షో తప్ప మరే ఈవెంట్ ని ప్లాన్ చేయకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. ట్రిపుల్ ఆర్ తరహాలో ప్రమోషన్స్ ని జోరుగా చేయాలని కోరుతున్నారట. మరి మేకర్స్ ఆ వైపు ఆలోచన చేస్తారా? లేక టీవీ షోలతోనే సరిపెట్టేస్తారా? చూడాలి.