Begin typing your search above and press return to search.

ఆర్‌ఆర్‌ఆర్‌ లో రెండు అద్బుతమైన ప్రేమ కథలు ఉంటాయట!

By:  Tupaki Desk   |   26 April 2021 1:30 AM GMT
ఆర్‌ఆర్‌ఆర్‌ లో రెండు అద్బుతమైన ప్రేమ కథలు ఉంటాయట!
X
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా లో అన్నదమ్ముల గొడవ, తల్లి కొడుకు సెంటిమెంట్‌ తో పాటు రెండు ప్రేమ కథలను కూడా చూపించిన విషయం తెల్సిందే. ప్రభాస్‌, అనుష్క మరియు ప్రభాస్‌, తమన్నాల ప్రేమలను కథలో లీనంగానే అద్బుతంగా చూపించిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆర్ఆర్‌ఆర్‌ లో కూడా జక్కన్న రెండు అద్బుతమైన ప్రేమ కథలను ప్రేక్షకుల ముందు ఆవిష్కరించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. చరణ్‌ మరియు ఆలియా భట్ ల ప్రేమ గురించి అందరికి తెల్సిందే.

ఎన్టీఆర్‌ ప్రేమను ఎలా చూపించబోతున్నాడు అనేది ఆసక్తికర విషయం. విదేశీ నటి ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. కొమురం భీమ్‌ కు అప్పటికే పెళ్లి అయినా కూడా విదేశీ యువతిని ప్రేమించడం జరగుతుందట. ఆ ప్రేమ అత్యంత మెచ్యూర్డ్‌ గా ఆకట్టుకునే విధంగా ఉంటుందని అంటున్నారు. రాజమౌళి ఈ రెండు ప్రేమ కథలను కూడా అద్బుత దృశ్య కావ్యాలుగా ఆవిష్కరించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఆర్ఆర్‌ఆర్‌ సినిమాలో చూపించబోతున్న ప్రేమ కథలు సినిమాకు మరింత ఆకర్షణగా ఉంటాయని అంటున్నారు.

సౌత్ లో అన్ని భాషలు మరియు హిందీ భాషతో పాటు మొత్తం 10 భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్‌ ల కథలతో ఈ సినిమాను జక్కన్న సరికొత్తగా చూపించబోతున్నాడు. స్వాత్వత్ర్యంకు పూర్వం రోజుల నేపథ్యంలో ఈ సినిమాను జక్కన్న తెరకెక్కిస్తున్నాడు.