Begin typing your search above and press return to search.
ట్రెండీ స్టోరి: క్రైసిస్ లో పెళ్లి బాజాలు.. ఏంటీ తమాషా?
By: Tupaki Desk | 2 Nov 2020 8:00 AM ISTకరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని తలకిందులు చేస్తోంది. చాలా మంది జీవితాల్ని మళ్లీ మొదటికి తెచ్చేసింది. కొంత మంది ఆకలి కేకలు వేస్తున్నారు. కోట్లాది మంది జీవితాల్ని జీతాల్ని కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇంతటి విపత్కరమైన పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ఓ వైపు చూస్తుంటే టాలీవుడ్ లో మాత్రం వరుస పెళ్లిళ్ల తో సందడి గా మారింది.
కరోనా క్రైసిస్ తీవ్రత మొదలైన ప్రారంభంలో పెళ్లంటే అబ్బే ఇప్పుడా అన్న వాళ్లంతా లాక్ డౌన్ పిరియడ్ లోనే పెళ్లికి సిద్ధమైపోతున్నారు. ఇప్పటికే కొంత మంది పెళ్లిళ్లు చేసుకుని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లితో షాకిచ్చారు. ఆ తరువాత యంగ్ హీరోలు వరుసగా క్యూ కట్టారు.
యంగ్ హీరోలు నిఖిల్ అండ్ నితిన్ డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ భారీగా ప్లాన్ చేసుకుని ఆ తరువాత కరోనా ఇప్పట్లో తగ్గడం అసంభవం అని తెలిసి లాక్‌డౌన్ సమయంలోనే సాదా సీదాగా పెళ్లిళ్లు చేసేసుకున్నారు. ఆ తరువాత దగ్గుబాటి వారబ్బాయి రానా కూడా భారీ రేంజ్ లో తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుని చివరికి సింపుల్‌గా 30 మంది బంధువుల మధ్య పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
రిసెంట్ గా చందమామ కాజల్ అగర్వాల్ తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుంది. త్వరలో కొణిదెల నిహారిక కూడా వివాహం చేసుకోబోతోంది. గుంటూరుకు చెందిన ఐజీ తనయుడు జొన్నలగడ్డ చైతన్యతో వివాహం జరగబోతోంది. ఇటీవలే వీరి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. డిసెంబర్ లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇదే వరుసలో మేగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తేజ్‌కు తగ్గ అమ్మాయిని వెతికే పనిలో ఫ్యామిలీ మెంబర్స్ ప్రస్తుతం బిజీగా వున్నారు. తనకు నచ్చిన అమ్మాయి ఫిక్స్ అయితే తేజ్ ఇంట పెళ్లిబాజాల సందడే.. ఇలా పాండమిక్ టైమ్ లోనూ వరుస షూటింగ్ లతో.. ఊహించని పెళ్లి ళ్లతో సందడి సందడిగా సాగుతోంది టాలీవుడ్.