Begin typing your search above and press return to search.

యూనివ‌ర్స‌ల్ స్టార్ కు అక్క‌డ‌ బిగ్ షాక్‌!

By:  Tupaki Desk   |   4 Nov 2022 6:30 AM GMT
యూనివ‌ర్స‌ల్ స్టార్ కు అక్క‌డ‌ బిగ్ షాక్‌!
X
యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `విక్ర‌మ్‌`. లోకేష్ క‌న‌గరాజ్ సినిమాటిక్ యూనివ‌ర్స్ నేప‌థ్యంలో అత్యంత భారీ స్థాయిలో రూపొందిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. 1986లో క‌మ‌ల్ హాస‌న్ బ్లాక్ స్క్వాడ్ గా న‌టించిన `విక్ర‌మ్‌` మూవీకి సీక్వెల్ గా ఈ సినిమాని తెర‌కెక్కించారు. యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ దాదాపు నాలుగేళ్ల విరామం త‌రువాత చేసిన సినిమా ఇది. గ‌త కొంత కాలంగా ఆశించిన స్థాయి విజ‌యాల్ని ద‌క్కించుకోలేక ఫామ్ కోల్పోయిన క‌మ‌ల్ కిది క‌మ్ బ్యాక్ ఫిల్మ్ గా నిలిచింది.

త‌మిళంతో పాటు తెలుగులోనూ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి క‌మ‌ల్ కెరీర్ లోనే అత్యంత భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమాగా స‌రికొత్త రికార్డుల్ని తిరగ‌రాసింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లోనే కాకుండా ఇత‌ర భాష‌ల్లోనూ విడుద‌లైన ఈ మూవీ ఊహించ‌ని విధంగా ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని భాష‌ల్లో క‌లిపి రూ. 430 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేసింది.

గ‌త కొంత కాలంగా అప్పుల్లో వున్న క‌మ‌ల్ ని ఒక్క‌సారిగా ఈ మూవీ ఒడ్డున ప‌డేసి గ‌తం కంటే భిన్నంగా రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ పై క్రేజీ హీరోల‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మించే స్టేజ్ కి తీసుకొచ్చింది.

త‌మిళ‌నాడులో ఈ మూవీని యంగ్ హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ రెడ్ జైయింట్ మూవీస్ పై రిలీజ్ చేయ‌గా అక్క‌డ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక తెలుగులో హీరో నితిన్ ఫాద‌ర్ ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై విడుద‌ల చేసి లాభాల్ని సొంతం చేసుకోవ‌డం విశేషం.

ఓటీటీ ప‌రంగానూ భారీ మొత్తానికి అమ్ముడు పోయిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టించిన‌ట్టే ఓటీటీ వేదిక‌గానూ అనూహ్యంగా ఆద‌ర‌ణ‌ని ద‌క్కించుకుంది. అయితే బుల్లితెర‌పై మాత్రం బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవ‌ల ప్ర‌ముఖ ఎంట‌ర్ టైన్ మెంట్ ఛాన‌ల్ లో ప్ర‌సార‌మైన ఈ మూవీకి 4.42 షాకింగ్ టీఆర్పీ ద‌క్క‌డం షాక్ కు గురిచేస్తోంది. టెలివిజ‌న్ లో ఈ మ‌ధ్య కాలంలో ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి ఈ స్థాయి షాకింగ్ టీఆర్పీ ద‌క్క‌డం ఇదే తొలిసారి కావ‌డంతో అంతా అవాక్క‌వుతున్నారు.

ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఫామ్ లోకి వ‌చ్చేశాక మొత్తం సినిమా బిజినెస్ తో పాటు శాటిలైట్ బిజినెస్ గేమ్ మొత్తం మారిపోయింది. ఓటీటీలో చూసిన వాళ్లు ప‌నిగా టీవీల్లో అదే సినిమాని మ‌రోసారి చూడ‌టానికి ఆస‌క్తిని చూప‌సించ‌డం లేదు. దీంతో థియేట‌ర్ల‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లుగా నిలిచిన కొన్ని సినిమాలు టెలివిజ‌న్ ల‌లో ఆ స్థాయి ఆద‌ర‌ణ‌ని ద‌క్కించుకోలేక‌పోతుండ‌టం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.