Begin typing your search above and press return to search.
మహేశ్ రూపాయి కాయిన్ టాటూ వెనుక పెద్ద కథే ఉందట!
By: Tupaki Desk | 7 May 2022 2:30 PM GMTలవ్ .. యాక్షన్ .. ఎమోషన్ లకు ప్రాధాన్యతనిస్తూ కథలను రెడీ చేసుకోవడంలో పరశురామ్ కి మంచి అనుభవం ఉంది. లవ్ .. కామెడీ అంశాలకు ఎమోషన్ టచ్ ఇస్తూ 'గీత గోవిందం' సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ఆయన, ఈ సారి లవ్ .. కామెడీ .. ఎమోషన్లకు యాక్షన్ టచ్ ఇస్తూ 'సర్కారువారి పాట' సినిమాను రూపొందించాడు. మహేశ్ బాబు - కీర్తి సురేశ్ నాయకా నాయికలుగా రూపొందిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పరశురామ్ మాట్లాడాడు.
"సాధారణంగా నేను టైటిల్ తో షూటింగుకు వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతాను. అలాగే ఈ సినిమాకి నేను 'సర్కారివారి పాట' టైటిల్ ను అనుకున్నాను. ఫోన్లో చెప్పగానే మహేశ్ బాబుగారు బాగుందని అన్నారు. ఆయనకి నచ్చడంతో అదే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది.
ఈ కథకి ఈ టైటిల్ కరెక్ట్ అంతే .. అందువలన అనుకున్నది ఒకటే టైటిల్ .. ఖాయం చేసింది కూడా అదే. ఇది కాకుండా ఈ సినిమాకి ఇంకో టైటిల్ పెట్టలేం .. పెట్టినా అంత ఎఫెక్టివ్ గా ఉండదు కూడా. ఈ రోజుల్లో కంటెంట్ లీక్ కాకుండా చూసుకోవడం చాలా కష్టమవుతోంది.
ఈ సినిమా నుంచి రీసెంట్ గా ట్రైలర్ ను వదిలాము. ఆ ట్రైలర్ లీక్ కాకుండా చూడటమనేది మాకు పెద్ద సవాల్ అయిపోయింది. గుణశేఖర్ గారిది .. పూరి గారిది .. నాది ఒకటే ఊరు. వైజాగ్ దగ్గర నర్సీపట్నం. 'ఒక్కడు'తో గుణశేఖర్ .. 'పోకిరి'తో పూరి .. మహేశ్ బాబుకి సూపర్ హిట్స్ ఇచ్చారు.
దాంతో ఎప్పటికైనా నేను కూడా మహేశ్ తో ఒక సూపర్ హిట్ కొట్టాలనే ఆలోచనతో ఉండేవాడిని. ఈ సినిమాకి ముందు నేను ఎప్పుడూ మహేశ్ గారిని కలవలేదు. ఈ సినిమా కోసమే ఆయనను కలవడం జరిగింది.
ఈ సినిమాలో మహేశ్ మెడపై వన్ రూపీ కాయిన్ టాటూ ఉంటుంది. ఆ టాటూ ఆయన ఎందుకు వేయించుకున్నాడనడానికి ఒక రీజన్ ఉంటుంది. ఈ సినిమాలోని 'పెన్నీ' సాంగులో సితార ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. కానీ ఈ సినిమాలో సితార ఎక్కడా కనిపించదు. లిరికల్ సాంగ్ అప్పుడు సితారతో సరదాగా చేయించాము అంతే. మహేశ్ కి కథ నచ్చితే ఇక డైరెక్టర్ కి వదిలేస్తారు. తన వైపు నుంచి హండ్రెడ్ పెర్సెంట్ అవుట్ పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఆ డెడికేషన్ వల్లనే ఆయన సూపర్ స్టార్ అయ్యారనే విషయం నాకు ఈ సినిమా ద్వారా తెలిసింది" అని చెప్పుకొచ్చాడు.