Begin typing your search above and press return to search.
`అవతార్ 2` పై భారీ క్రేజ్‌వుంది కానీ..
By: Tupaki Desk | 5 Dec 2022 11:30 PM GMTప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ సినిమా `అవతార్ 2`. జేమ్స్ కెమెరూన్ అద్భుత సృష్టి `అవతార్` కు సీక్వెల్ గా అత్యంత భారీ స్థాయిలో వరల్డ్ ఫస్ట్ టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. `అవతార్` కు సెకండ్ ఇన్ స్టాల్ మెంట్ గా వస్తున్న ఈ మూవీని `అవతార్ ద వే ఆఫ్ వాటర్` పేరుతో డిసెంబర్ 16న అత్యంత భారీ స్థాయిలో రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్ తో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో విడుదల కానుంది.
ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయి. అడ్వాన్స్ పరంగా ఈ మూవీ రికార్డ్స్ ని తిరగరాస్తోంది. ప్రీమియం పార్మాట్ లలో 45 స్క్రీన్ లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా రికార్డు స్థాయిలో టికెట్ లు అమ్ముడు పోయి ఆశ్చర్యపరుస్తోంది. నవంబర్ చివరి వారంలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా కేవలం మూడు రోజుల్లోనే 15000 టికెట్ లు అమ్ముడు పోవడం విశేషం. 13 ఏళ్ల క్రితం వచ్చిన `అవతార్` ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది.
దానికి సీక్వెల్ గా వస్తున్న`అవతార్ ద వే ఆఫ్ వాటర్` అంతకు మించిన స్థాయిలో రికార్డుల్ని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మినహా ఇతర రాష్ట్రాల్లో ఈ మూవీ టికెట్ కు రికార్డు స్థాయిలో రూ.1400 టికెట్ రేట్ ని ఖరారు చేశారు. దీంతో అక్కడ రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం `అవతార్ ద వే ఆఫ్ వాటర్`టికెట్ రేట్లని రూ. 350 గా మాత్రమే నిర్ణయించడం విశేషం.
ఇదిలా వుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో `అవతార్ ద వే ఆఫ్ వాటర్` కు రికార్డు స్థాయి క్రేజ్ కొనసాగుతోంది. కానీ టికెట్ లకు మాత్రం ఆ స్థాయిలో డిమాండ్ లేకపోవడం గమనార్హం. `అవతార్ ద వే ఆఫ్ వాటర్` తరువాత తమ సినిమాలని థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్న చాలా మంది మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ తో తమ సినిమాల పబ్లిసిటీ కంటెంట్ ని యాడ్ చేసి థియేటర్లకు వదులుతున్నారు. ఈ మూవీ క్రేజ్ ని మాగ్జిమమ్ తమ సినిమాలకు గ్రాబ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో క్యూబ్, అండ్ యుఎఫ్ ఓ సంస్థలు తెలుగు సినిమాల పబ్లిసిటీ కంటెంట్ కు బారీగా డిమాండ్ చేస్తున్నాయట. `అవతార్ ద వే ఆఫ్ వాటర్` తో `పుష్ప` టీజర్ ని రిలీజ్ చేయాలని మేకర్స్ భారీగా ప్లాన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేయాలనుకుంటున్నారట. పుష్ప 2 టీమ్ తరహాలోనే నిఖిల్ `18పేజెస్, రవితేజ ధమాకాని కూడా `అవతార్ ద వే ఆఫ్ వాటర్` తో అటచ్ చేయబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.