Begin typing your search above and press return to search.

యశోద ఓటీటీలో కూడా పెద్ద బజ్ లేదు..!

By:  Tupaki Desk   |   12 Dec 2022 11:30 AM GMT
యశోద ఓటీటీలో కూడా పెద్ద బజ్ లేదు..!
X
సమంత ప్రధాన పాత్రలో తమిళ దర్శక ద్వయం హరి హరీష్ చేసిన సినిమా యశోద. శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. ఫిమేల్ సెంట్రిక్ సినిమా అనే ఆలోచన లేకుండా సమంత ఉంది కదా అని యశోద సినిమాకు దాదాపు 30 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేశారు దర్శక నిర్మాతలు. సినిమా రిలీజ్ టైం లో సమంత ప్రమోషన్స్ కి అందుబాటులో లేకపోయినా నవంబర్ 11న రిలీజైన యశోద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

సమంత పర్ఫార్మెన్స్ వరకు బాగున్నా సినిమా ఆశించిన స్థాయిలో లేదని అనిపిస్తుంది. అయినా సరే థియేట్రికల్ రన్ పర్వాలేదు అనిపించగా రీసెంట్ గా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ చేశారు. డిసెంబర్ 9న యశోద ఓటీటీ రిలీజైంది. ఓటీటీలో అయినా ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుందని అనుకోగా అక్కడ కూడా నిరాశపరచింది. అసలు యశోద సినిమా ఓటీటీలో రిలీజైంది అన్న సందడే లేదని చెప్పొచ్చు. ఓటీటీలో కూడా సమంత యశోదకి యావరేజ్ మార్కులే పడ్డాయి.

థియేట్రికల్ రన్ ఎలా ఉన్నా కొన్ని సినిమాలు ఓటీటీలో సూపర్ టాక్ తెచ్చుకుంటాయి. ఓటీటీలో చూశాక అర్రె మంచి సినిమా థియేటర్ లో మిస్ అయ్యాం అనిపిస్తుంది. కానీ యశోద సినిమా ఓటీటీ లో చూసినా సరే పెద్దగా ఎక్సయిట్ అవట్లేదు ఆడియన్స్. లేడీ ఓరియెంటెడ్ మూవీగా వచ్చిన యశోద సినిమా ఒక సిన్సియర్ ఎఫర్ట్ అనిపించినా సినిమాలో కొన్ని అంశాలు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. అందుకే సినిమాని అలా జస్ట్ యావరేజ్ గా ఉంచారు.

ఈ సినిమా వల్ల సమంతకు వచ్చిన నష్టం కూడా లేదు. యశోద తో సమంత యాక్షన్ సీన్స్ లో కూడా తను చేయగలను అని ప్రూవ్ చేసుకుంది. సమంత త్వరలో శాకుంతలంతో రాబోతుంది ఆ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుండగా ఆ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.