Begin typing your search above and press return to search.

జనాలు ఆ రెండు సినిమాలనూ మర్చి పోయారు

By:  Tupaki Desk   |   11 Aug 2020 1:30 AM GMT
జనాలు ఆ రెండు సినిమాలనూ మర్చి పోయారు
X
కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సినీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఇండియాలోని అన్ని భాషల సినిమా పరిశ్రమలు కూడా స్థంభించి పోయాయి. షూటింగ్స్‌ లేక కార్మికులు కష్టాలు పడుతున్నారు. ఈమద్య సీరియల్స్‌ మరియు వెబ్‌ సిరీస్‌ ల షూటింగ్స్‌ ప్రారంభం అయ్యాయి. కనుక కాస్త ఊపరి పీల్చుకుంటున్నారు. కరోనా లాక్‌ డౌన్‌ కు ముందు కొన్ని సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కాని ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పటి నుండి ఆ సినిమాలో ఊసే కనిపించడం లేదు.

తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ఒక సినిమాను తెలుగులో వెంకటేష్‌ ‘నారప్ప’ అనే టైటిల్‌ తో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ఇది రీమేక్‌ అవుతుంది. ఈ సినిమాలోని వెంకీ లుక్‌ మరియు ఇతత్ర విషయాల వల్ల సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురు చూశారు. సమ్మర్‌ లో సినిమా వచ్చి ఉండేది. కాని సినిమా కరోనా కారణంగా పూర్తి కాకుండా ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు మొదలయ్యేది తెలియడం లేదు. అయిదు నెలలుగా ఆ సినిమానే పట్టించుకోలేదు.

ఇతర సినిమాలకు సంబంధించి ఏదో ఒక ప్రకటన చేయడం లేదంటే సోషల్‌ మీడియాలో పోస్టర్స్‌ విడుదల చేయడం వంటివి చేయడం వల్లల జనాల్లో వాటి గురించిన చర్చ జరిగేది. కాని నారప్ప గురించి ఎలాంటి అప్‌ డేట్‌ లేదు. కనుక జనాలు నారప్పను మర్చి పోతున్నారు. ఇదే సమయంలో నాగార్జున చేయాలనుకున్న బంగార్రాజు గురించి కూడా జనాలు మర్చి పోయారు. దాంతో నాగ్‌ కూడా ఆ సినిమాను పక్కకు పెట్టేసినట్లుగా తెలుస్తోంది. బంగార్రాజును తెరకెక్కించాలనుకున్న కళ్యాణ్‌ కృష్ణ ప్రస్తుతం మరో హీరోతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కరోనా కారణంగా ఆ సినిమా గురించి జనాలు మర్చి పోయారు, ఈ సినిమాను జనాలు పట్టించుకోవడమే లేదు.