Begin typing your search above and press return to search.
మెగాస్టార్ 'ఎలివేషన్స్'లో ఏమాత్రం లోటు ఉండదట!
By: Tupaki Desk | 21 Jun 2021 5:30 AM GMTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య పై రోజురోజుకి అంచనాలు భారీగా పెంచుతున్నారు మేకర్స్. ఈ సినిమాను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా మాట్నీ ఎంటర్టైన్మెంట్ - కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకుంది. వచ్చే నెలలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తారని టాక్. అయితే సామాజిక అంశాలతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమాలు రూపొందించడంలో డైరెక్టర్ కొరటాల దిట్ట అని ఇదివరకే ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆచార్య కూడా అలాగే ఉండబోతుందట.
అయితే తాజాగా ఆచార్య సినిమా గురించి ఆసక్తికరమైన విషయం ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని ఆల్రెడీ టీజర్ చూస్తే అర్ధమవుతుంది. చిరు పాత్రలో ముఖ్యంగా హీరో ఎలివేషన్స్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయని తెలుస్తుంది. ఆ రేంజ్ లో మెగాస్టార్ ను కాప్చర్ చేస్తున్నాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో చిరు ఎండోమెంట్ అధికారి క్యారెక్టర్ సీరియస్ గా సాగుతూనే ఎమోషనల్ టచ్ ఉంటుందని తెలుస్తుంది. అంతలా ట్విస్టులు.. హీరోయిజం..పోరాట ఘట్టాలు.. ఇలా అన్నీ అంశాలు మేళవించినట్లు ఇదివరకే కొరటాల బయటపెట్టాడు. చిరు కోసం బాగా ఎమోషన్స్ తో కూడిన స్ట్రాంగ్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు చాలా ఉన్నాయని తెలిపాడు.
అయితే ఈ సినిమాలో రాంచరణ్.. పూజాహెగ్డే లతో పాటు సీనియర్ హీరోయిన్ సంగీత కూడా కీలకపాత్రలో కనిపించనుందని వార్తలొస్తున్నాయి. ఆమె పాత్రకు సంబంధించి దేవాలయంలో ఓ నర్తకిగా నటిస్తుందని టాక్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ ఈ సినిమాలో చిరు సరసన నటిస్తోంది. మొత్తానికి ఈ సినిమాలో మెగా అభిమానులు పవర్ఫుల్ చిరంజీవిని చూస్తారని అర్ధమవుతుంది. సినిమా ఆలస్యం అవుతున్నా కొద్దీ ఫ్యాన్స్ లో అంచనాలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. దాదాపు పన్నెండేళ్ల తర్వాత మణిశర్మ చిరు సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం మెగాస్టార్ మలయాళం లూసిఫర్ రీమేక్ లో నటించనున్నాడు.