Begin typing your search above and press return to search.
బిబి4 : ఈ వారం నామినేషన్ లో ఉన్న వారు లక్కీ
By: Tupaki Desk | 26 Nov 2020 4:00 PM GMTబిగ్ బాస్ సీజన్ 4 మరో మూడు వారాలు ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. హౌస్ లో ఉన్నది మొత్తం 7 మంది. వారిలో ఇద్దరు ఎలిమినేట్ అయితే మిగిలిన 5 మంది ఫైనల్ వారంకు వెళ్తారు. వెళ్లబోతున్న ఆ ఇద్దరు ఎవరు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యి ఉన్న మోనాల్, అవినాష్, అరియానా మరియు అఖిల్ ల్లో ఒక్కరు ఎలిమినేట్ అయ్యి వెళ్లాలి. కాని ఈ వారం ఎవ్వరిని కూడా ఎలిమినేట్ చేయడం లేదు అంటూ సమాచారం అందుతోంది. ఎలిమినేట్ చేయాల్సి వస్తే అవినాష్ ను చేయాల్సి ఉంటుంది. కాని ఇప్పటికే అతడికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది.
అతడు ఎలిమినేషన్ ను తప్పించుకోవడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండక పోవచ్చు అంటున్నారు. ఇప్పటి వరకు కేవలం రెండు సార్లు మాత్రమే నామినేషన్ ను ఎదుర్కొన్న అతడికి ఎక్కువగా ఓట్లు ఈసారి పడలేదు. గతంలో ఎక్కువ మంది ఎవరికైతే వేశారో వారు మళ్లీ వేస్తున్నారు. ఎక్కువ సార్లు నామినేట్ అవ్వని అవినాష్ కు ఓట్లు వేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అందుకే ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అయ్యేవాడు. కాని ఈసారి లక్కీగా అతడికి పాస్ దక్కింది. అతడు కాకుండా మరెవ్వరైనా ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉందా అనుకుంటూ ఉండగా అనూహ్యంగా బిగ్ బాస్ టీం నుండి ఈ వారం ఎలిమినేషన్ లేదు అనే లీక్ వచ్చింది. వచ్చే రెండు వారాలు వరుసగా ఇద్దరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మిగిలిన వారు చివరి వారం ఫైనల్ 5 లో ఉంటారు.