Begin typing your search above and press return to search.

ఆ హీరో సినిమా త‌ప్ప అక్క‌డ ఆప్ష‌న్ లేదు?

By:  Tupaki Desk   |   21 Sep 2022 2:30 PM GMT
ఆ హీరో సినిమా త‌ప్ప అక్క‌డ ఆప్ష‌న్ లేదు?
X
ప్ర‌తీ వారం ఓటీటీ ప్రియుల‌కు కావాల్సిన వినోదం ల‌భిస్తూనే వుంది. లాస్ట్ వీక్ హిట్ సినిమాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ కావ‌డంతో చాలా మంది థియేట‌ర్ల‌లో వీక్షించ‌ని వారు ఓటీటీల్లో చూడాల‌ని ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించారు. చాలా వ‌ర‌కు అనుకున్న హిట్ సినిమాల‌ని చూశారు కూడా. కానీ ఈ వారం మాత్రం ఓటీటీ ప్రియుల‌కు పెద్ద‌గా ఆశించిన స్ట‌ఫ్ ల‌బించ‌డం క‌ష్ట‌మ‌నే చెప్పాలి. గ‌త వారంతో పోలిస్తే ఈ వారం ద‌క్షిణాది సినీ ప్రియుల‌కు ఓటీటీ వేదిక‌గా వున్న ఒకే ఒక ఆప్ష‌న్ ధ‌నుష్ మూవీ.

గ‌త వారం మ‌ల‌యాళ సినిమాలు త‌ళ్లుమాల‌, న్న తాన్ కేస్ కొడు ఓటీటీల్లో స్ట్రిమింగ్ అయ్యాయి. త‌ళ్లుమాల మ‌ల‌యాళంతో పాటు తెలుగులోనూ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కావ‌డంతో చాలా మంది అక్క‌డే వీక్షించారు. ఇప్ప‌టికీ కొంత మంది చూస్తున్నారు కూడా. అయితే ఈ వారం మాత్రం చెప్పుకోద‌గ్గ సినిమాలేవీ ఓటీటీల్లో క‌నిపించ‌డం లేదు. ఓటీటీ ప్రియుల‌కు ఈ వారం వున్న ఏకైక ఆప్ష‌న్ ధ‌నుష్ న‌టించిన `తిరు చిత్రాంబ‌ళం`.

ఇదే మూవీని తెలుగులో `తిరు` పేరుతో ఓటీటీలో రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. నిత్యామీన‌న్‌, రాశీఖ‌న్నా హీరోయిన్ లుగా న‌టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించిన ధ‌నుష్ ని తొలి సారి వంద కోట్ల క్ల‌బ్ హీరోని చేసింది. ఇది ధ‌నుష్ కెరీర్ లోనే రికార్డుగా నిల‌వ‌డం విశేషం. ఓ సాధార‌ణ ఫుడ్ డెలివ‌రీ బాయ్ క‌థ‌గా ఈ మూవీని రూపొందించారు.

భార‌తీ రాజా, ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంది. సున్నిత‌మైన భావోద్వేగాల స‌మాహారంగా రూపొందిన ఈ మూవీ సెప్టెంబ‌ర్ 23 నుంచి స‌న్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. 22న విజ‌య్ దేవ‌ర‌కొండ `లైగ‌ర్‌` డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నా దీనిపై పెద్ద‌గా ఎవ‌రికీ ఆస‌క్తి లేదు. ఇక అదే రోజు అదే ఓటీటీలో త‌మ‌న్నా న‌టించిన `బ‌బ్లీ బౌన్స‌ర్‌` కూడా వ‌చ్చేస్తోంది. దీనిపై కూడా ఎవ‌రూ ఆస‌క్తిని చూపించ‌డం లేదు. దీంతో ఓటీటీ ప్రియుల‌కు ఈ వారం వున్న ఏకైక ఆప్ష‌న్ గా ధ‌నుష్ `తిరు చిత్రాంబ‌ళం` నిలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.