Begin typing your search above and press return to search.
ఆ విషయంలో ప్రభాస్ కు పోటీ వచ్చే మరో హీరో లేడు..!
By: Tupaki Desk | 2 Nov 2022 2:30 AM GMT'బాహుబలి' సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన డార్లింగ్ ప్రభాస్.. జాతీయ స్థాయిలో క్రేజీ హీరోగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టిన యంగ్ రెబల్ స్టార్.. వచ్చే ఏడాది బ్యాక్ టూ సినిమాలతో రావడానికి రెడీ అయ్యారు. అయితే ఇవన్నీ కూడా వేటికవే ప్రత్యేకమైన జోనర్స్ లో తెరకెక్కుతున్న సినిమాలు కావడం గమనార్హం.
ఈ ఏడాదిలో 'రాధే శ్యామ్' వంటి పీరియాడిక్ లవ్ డ్రామాతో ప్రభాస్ పరాజయం చవిచూశారు. అయినప్పటికీ డార్లింగ్ అభిమానులు పెద్దగా నిరాశ చెందలేదు. ఎందుకంటే తమ ఫేవరేట్ హీరో లైనప్ లో అన్నీ ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ఉండటంతో.. ఇకపై వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉందని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' వంటి పౌరాణిక చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది.
రామాయణ ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ''ఆదిపురుష్''. ఇది ప్రభాస్ నటిస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ హిందీ సినిమా.. అలానే ఫస్ట్ మైథలాజికల్ చిత్రం. మోషన్ క్యాప్చర్ పిక్చర్ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో శ్రీరాముడు పాత్రలో కనిపించనున్నారు. టీ-సిరీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ కు మిశ్రమ స్పందన వచ్చింది.
'ఆదిపురుష్' అనేది మోషన్ క్యాప్చర్ లో 3డీలో తీసిన సినిమా అని జనాలను ముందు నుంచీ ప్రిపేర్ చేయకపోవడం వల్లనే టీజర్ పై ట్రోల్స్ వచ్చాయి. ఒక్కసారిగా ప్రభాస్ ను యానిమేషన్ లుక్ లో చూడటంతో అలాంటి రెస్పాన్స్ వచ్చిందని భావించవచ్చు. అయితే ఆ తర్వాత థియేటర్లో ప్రదర్శించిన 3డీ టీజర్ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన రావడాన్ని బట్టి చూస్తే.. ఇది బిగ్ స్క్రీన్ మీద సరికొత్త అనుభూతిని కలిగించే చిత్రమనే అభిప్రాయానికి వచ్చారు.
'ఆదిపురుష్' సినిమాని వచ్చే సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ.. క్లాష్ ని నివారించడానికి వాయిదా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. నేపథ్యానికి తగ్గట్టుగా శ్రీరామ నవమి పండక్కి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ''సలార్'' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది అవుట్ అండ్ అవుట్ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా మాస్ అవతార్ లో డార్లింగ్ ను ప్రెజెంట్ చేయనున్నారు. 'కేజీఎఫ్' ప్రాంచైజీతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన నీల్.. ఈసారి ప్రభాస్ తో కలిసి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అభిమానులను ఎగ్జైట్ చేసే మరో అంశం ఏంటంటే.. 'సలార్' ను కూడా 'కేజీయఫ్' తరహాలో రెండు భాగాలుగా రూపొందనుందని అంటున్నారు. ప్రస్తుతానికైతే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఏదేమైనా ఇది కచ్చితంగా ఫ్యాన్స్ ఆశించే సినిమా అవుతుందని ధీమాగా ఉన్నారు. 2023 సెప్టెంబర్ లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుందని హోంబలే నిర్మాతలు ప్రకటించారు.
అలానే 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ''ప్రాజెక్ట్ K'' వంటి మెగా బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్. ఇది సైన్స్ ఫిక్షన్ అండ్ సోషియో ఫాంటసీ జోనర్ సూపర్ హీరో మూవీ అని ప్రచారం జరుగుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. డార్లింగ్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన స్పెషల్ పోస్టర్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
చైనా - అమెరికా వంటి ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని.. ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో విడుదల చేస్తామని నిర్మాత అశ్వినీదత్ తెలిపారు. 2024 దసరా సీజన్ లో లేదా 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. 'ప్రాజెక్ట్ K' సినిమా తప్పకుండా ప్రభాస్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయే సినిమా అవుతుంది.
ఇకపోతే మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ సైలెంట్ గా ఓ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసారు. 'రాజా డీలక్స్' అనే పేరుతో ప్రచారం చేయబడుతున్న ఈ సినిమా హారర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోందనే ఊహాగానాలు ఉన్నాయి. పీపుల్స్ మీడియా బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ మూవీ వచ్చే ఏడాది 'ఆదిపురుష్' మరియు 'సలార్' మధ్యలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
దీన్ని బట్టి అన్నీ అనుకున్నట్లు జరిగితే 2023 లో ప్రభాస్ నుంచి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ 'సలార్' లేట్ అయినా రెండు సినిమాలు పక్కా రిలీజ్ అవుతాయి. ఇదే క్రమంలో టీ-సిరీస్ బ్యానర్ లో సందీప్ వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. అందులో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ గా కనిపించనున్నారు. 'యానిమల్' సినిమా పూర్తైన వెంటనే దర్శకులు ప్రభాస్ చిత్రం కోసం పని చేయనున్నాడు. 2024 లో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది.
దీని ప్రకారం రాబోయే మూడేళ్ళలో ప్రభాస్ నటించిన 5 సినిమాలు థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా వేటికవే ప్రత్యేకమైన జోనర్స్ లో తెరకెక్కే భిన్నమైన చిత్రాలు కావడం విశేషం. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఏ స్టార్ హీరో కూడా ఇన్ని భారీ ప్రాజెక్ట్స్ లో భాగం కాలేదనే చెప్పాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో నిర్మాతలు ఒక్క ప్రభాస్ మీదనే కొన్ని వందల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. ఈ విషయంలో యంగ్ రెబల్ స్టార్ కు పోటీ వచ్చే హీరో లేడనే చెప్పాలి. మరి ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలు అందుకుంటాయి.. అతని స్టార్ డమ్ ని ఏ మేరకు నిలబడతాయనేది వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.