Begin typing your search above and press return to search.
శరణ్ ని వదిలే ప్రసక్తే లేదు : బెల్లంకొండ సురేష్
By: Tupaki Desk | 12 March 2022 8:31 AM GMTప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ లపై చీటింగ్ కేసుని నమోదు చేస్తూ శరణ్ అనే వ్యక్తి బంజారా హిల్స్ పోలీస్టేషన్ లో కేసు ఫైల్ చేయడం సినీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఫైన్షియర్ గా చెప్పుకున్న శరణ్ తనని ఆ ఇద్దరు నమ్మించి మోసం చేశారని, సినిమా తీస్తామంటూ 85 లక్షలు కాజేశారని, ఈ విషయంలో తాను మోసపోయానని శరణ్ బంజారా హిల్స్ పోలీసుల్ని ఆశ్రయించిన విషయం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ విషయంపై ఆగ్రహాన్నివ్యక్తం చేసిన బెల్లంకొండ సురేష్ శరణ్ ని ఎట్టిపరిస్థితుల్లో వదిలే ప్రసక్తిలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
శనివారం ప్రత్యేకంగా మీడియా ముందుకొచ్చిన బెల్లంకొండ సురేష్ ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతని సంతరించుకుంది. నన్ను నా ఫ్యామిలీ ని ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది పన్నిన కుట్రలో భాగంగానే నా పై కేసు నమోదు చేశారని, నాకు శరణ్ ఎలాంటి డబ్బు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
నా పై నా కొడుకు పై కావాలనే కుట్ర చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, శరణ్ ఒక్క పైసా మాకు ఇవ్వలేదు డబ్బులు ఇచ్చినట్టుగా సాక్ష్యాలు వుంటే పోలీసులకు ఇవ్వాలి.
శరణ్ తో కలిసి కొంత మంది వ్యక్తులు నా కుటుంబంపై కుట్ర చేస్తున్నారు. నాకు డబ్బులు ఇచ్చినట్టుగా ఆధారాలు చూపించకపోతే పరువు నష్టం దావా వేస్తా. నా ఫ్యామిలీ ఎదుగుదలని చూసి ఓర్వలేకే కేసులు పెడుతున్నారు. విచారణకు ఖచ్చితంగా సహకరిస్తా.
గత ఐదేళ్లుగా ఎలాంటి ఫంక్షన్ లకు రాకుండా మా పని మేము చేసుకుంటున్నాం. అలాంటి మమ్మల్ని కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక పెద్ద వ్యక్తి వున్నారు. అది ఎవరో సాక్ష్యాధారాలతో సహా సోమవారం బయటపెడతా అన్నారు బెల్లంకొండ సురేష్.
ఆయన ఇంకా మాట్లాడుతూ 'శరణ్ నా పిల్లల జోలికి వచ్చాడు. నా పిల్లలు నాకు పంచ ప్రాణాలు. శరణ్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదు. తనని లీగల్ గా పతనం చేస్తా. శరణ్ ది మాఊరే.. ప్రతీ వారం ఫోన్ చేసి టికెట్ లు కావాలని వేధించే వాడు. అతని బాధ తట్టుకోలేక టికెట్ లు ఇవ్వమని నేనే చెప్పాను. తను నా కొడుకుల జోలికి వచ్చాడు. అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా బుద్ధి చెబుతాను. అతన్ని క్షమించను. బ్లాక్ మెయిల్ లో భాగంగానే ఇదంతా చేస్తున్నారు' అంటూ శరణ్ పై బెల్లంకొండ సురేష్ నిప్పులు చెరిగారు.