Begin typing your search above and press return to search.

ఒక్క హిట్టు లేదు కానీ వ‌రుస సినిమాలు.. డ‌బ్బెక్క‌డిది సామీ

By:  Tupaki Desk   |   8 April 2022 11:30 PM GMT
ఒక్క హిట్టు లేదు కానీ వ‌రుస సినిమాలు.. డ‌బ్బెక్క‌డిది సామీ
X
ఇండ‌స్ట్రీలో ప్రొడ్యూసర్ గా నిల‌బడాలంటే మొద‌టి సినిమా గ్యారెంటీగా సూప‌ర్ హిట్ కావాల్సిందే. కానీ తొలి మూవీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఓ నిర్మాత‌కు హిట్టులేదు వ‌రుస‌గా ఫ్లాపులు, న‌ష్టాలే... త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ఏ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆడింది లేదు.. సూప‌ర్ హిట్ టాక్ ని తెచ్చుకుందీ లేదు.. కానీ త‌ను మాత్రం ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ కాంబినేష‌న్ ల‌తో సినిమాలు చేస్తుండ‌టంతో ఒక్క హిట్టు లేదు కానీ వ‌రుస సినిమాలు చేస్తున్నాడు ఈ డ‌బ్బెక్క‌డిది సామీ అనే చ‌ర్చ ఫిలిం స‌ర్కిల్స్ లో జ‌రుగుతోంది. ఇప్పుడిదొక హాట్ టాపిక్ గా మారింది.

ఓ పేరున్న యంగ్ రైట‌ర్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఓ స్టార్ కెమెరామెన్ నేన‌ల్లుడు హీరోగా న‌టించిన చిత్రంతో యంగ్ ప్రొడ్యూస‌ర్ త‌న కెరీర్ ని ప్రారంభించారు. దీనికి ఆయ‌న భాగ‌స్వామిగా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రించారు. నిత్యామీన‌న్ వంటి క్రేజీ హీరోయిన్ న‌టించినా ఈ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల‌ప‌డిపోయింది. అస‌లు ఈ మూవీ ఎప్పుడు వ‌చ్చిందో ఎప్పుడు వెళ్లిందో తెలియ‌కుండానే తెర‌మ‌రుగైపోయింది. దీని వ‌ల్ల యంగ్ ప్రొడ్యూస‌ర్ గా కెరీర్ ప్రారంభించిన యంగ్ ప్రొడ్యూస‌ర్ కు చేదు అనుభ‌వం ఎదురైంది.

ఆ త‌రువాత క్రేజీ కాంబినేష‌న్ లో పేరున్న యంగ్ డైరెక్ట‌ర్ తో సోలో ప్రొడ్యూస‌ర్ గా మ‌రో సినిమా తీశారు. ఈ చిత్రానికి ముందు భారీ హైప్ క్రియేట్ అయింది. కానీ హ‌ద్దులు దాటిన బ‌డ్జెట్ , ఆశించిన స్థాయిలో క‌థ‌, క‌థ‌నాలు ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో ఈ మూవీ ఫ్లాప్ గానే మిగిలిపోయింది. దీంతో సోలో ప్రొడ్యూస‌ర్ గా చేసిన ప్ర‌య‌త్నం కూడా విఫ‌ల‌మైపోయింది.

దీంతో స్టార్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీకి చెందిన వార‌సుడు హీరోగా, తొలి చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప్ర‌శంస‌లందుకున్న ద‌ర్శ‌కుడితో 90వ ద‌శ‌కంలో ఉత్త‌ర తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఓ భారీ మూవీని నిర్మించారు. క‌రోనా కార‌ణంగా రిలీజ్ ఆల‌స్యం అవుతూ వ‌చ్చిన ఈ మూవీ భారీ చిత్రాలు, చిన్న చిత్రాలు రిలీజ్ అవుతున్నా ఇప్ప‌టికీ రిలీజ్ కు నోచుకోవ‌డం లేదు. దీనిపై భారీగానే ఖర్చు చేసిన యంగ్ ప్రొడ్యూస‌ర్ ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీ అయినా త‌న‌ని స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ గా నిల‌బెదుతుంద‌ని ఆశిస్తున్నారు.

భారీ అంచ‌నాలు పెట్టుకున్న సినిమా రిలీజ్ ఆగిపోయినా త‌ను మాత్రం ఎక్క‌డా త‌గ్గేదిలే అన్న‌ట్టుగా త‌న తొలి చిత్ర హీరోగా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ని నిర్మించారు. క్రేజీ కాంబినేష‌న్.. పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన సినిమాలో న‌టించిన క్రేజీ భామ హీరోయిన్ గా న‌టించినా ఈ మూవీ కూడా పెద్ద‌గా ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. అయినా స‌రే ఎక్క‌డా త‌గ్గ‌ని యంగ్ ప్రొడ్యూస‌ర్ బ్యాక్ టు బ్యాక్ రెండు క్రేజీ చిత్రాల‌ని ప‌ట్టాలెక్కించాడు.

అందులో ఒక‌టి మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో మ‌రొక‌టి నేచుర‌ల్ స్టార్ నాని తో ఈ ఇద్ద‌రు హీరోల్లో ఓ హీరోతో చేస్తున్న మూవీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. మ‌రో మూవీ మాసీవ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతోంది. దీన్ని పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాష‌ల్లో రిలీజ్ కి ప్లాన్ చేశారు. క్రేజీ కాంబినేష‌న్ లు కుదురుతున్నా స‌ద‌రు యంగ్ ప్రొడ్యూస‌ర్ కి నాలుగు చిత్రాలు నిర్మించి మ‌రో మూడు రిలీజ్ కి రెడీ అవుతున్నా స‌రైన హిట్ ల‌భించ‌క‌పోవ‌డం.. అయినా స‌రే బ్యాక్ టు బ్యాక్ క్రేజీ కాంబినేష‌న్ ల‌తో సినిమాల్ని సెట్స్ పైకి తీసుకెళుతున్న తీరు ప‌లువురిని విస్మ‌యానికి గురిచేస్తోంది.

వ‌రుస ప్లాపులు ఎదుర‌వుతున్నా స‌ద‌రు యంగ్ ప్రొడ్యూస‌ర్ వెంట‌నే మ‌రో క్రేజీ కాంబినేష‌న్ తో సినిమా ఎలా చేస్తున్నాడ‌న్న‌ది ఇప్ప‌డు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. ఒక్క హిట్టు లేదు కానీ వ‌రుస సినిమాలు ఎలా సాధ్యం.. డ‌బ్బెక్క‌డిది సామీ అని అంతా ఆరాతీస్తున్నారు. అయితే ఈ నేఫ‌థ్యంలో స‌ద‌రు నిర్మాత‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి బ‌య‌టికొచ్చింది. స‌ద‌రు యంగ్ ప్రొడ్యూస‌ర్ సినిమాలు పోతున్నా బ్లాక్ టు బ్యాక్ క్రేజీ కాంబినేష‌న్ ల‌తో సినిమాలు చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కొంత మంది ఎన్నారైల‌ని వారి కార‌ణంగానే స‌ద‌రు యంగ్ ప్రొడ్యూస‌ర్ ఒక సినిమా పోయినా స‌రే వెంట‌నే మ‌రో క్రేజీ చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడ‌ని, ఎన్నారైల కు సంబంధించిన ఓ గ్రూప్ ఆయ‌న‌కు డ‌బ్బు అందించిన సినిమాలు నిర్మిస్తోంద‌ని ఇండస్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

అయితే క్రేజీ కాంబినేష‌న్ లు సెట్ చేస్తూ సినిమాలు నిర్మిస్తున్న యంగ్ ప్రొడ్యూస‌ర్ అదే స్థాయిలో స‌క్సెస్ లు సాధిస్తే బాగుంటుద‌ని, ఇలాంటి నిర్మాత‌లు స‌క్సెస్ అయితే ఇండ‌స్ట్రీలోని వారికి చేతినిండా ప‌ని వుంటుంద‌ని కొంత మంది భావిస్తున్నారు.