Begin typing your search above and press return to search.

కావాలని కౌశల్‌ ఆర్మీని కెలుకుతున్నాడా?

By:  Tupaki Desk   |   12 Sep 2018 1:30 AM GMT
కావాలని కౌశల్‌ ఆర్మీని కెలుకుతున్నాడా?
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 పార్టిసిపెంట్‌ కౌశల్‌ కు ఏ స్థాయిలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కౌశల్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కు స్టార్స్‌ కూడా షాక్‌ అవుతున్నారు. తన వ్యక్తిత్వంతో భారీ ఎత్తున ఫ్యాన్స్‌ ను సంపాదించుకున్న కౌశల్‌ ఖచ్చితంగా టైటిల్‌ విజేత అంటూ అంతా నమ్ముతున్నారు. కౌశల్‌ అభిమానులు కౌశల్‌ ఆర్మీగా తయారు అయ్యి సోషల్‌ మీడియాలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. కౌశల్‌ గురించి ఇంటి సభ్యులు ఏ చిన్న మాట జారినా - నాని ఏమైనా నెగటివ్‌ గా కామెంట్‌ చేసినా కూడా కౌశల్‌ ఆర్మీ పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ మొదలు పెడుతున్నారు. అందుకే కౌశల్‌ గురించి ఏమైనా మాట్లాడాలంటేనే నాని కాస్త వెనుకాముందు ఆడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నారు.

కౌశల్‌ ఆర్మీ పవర్‌ తెలిసి కూడా ఇటీవలే ఎలిమినేట్‌ అయిన గణేష్‌ నోటికి వచ్చినట్లుగా మాట్లాడేస్తున్నాడు. సామాన్యుడి కోటాలో బిగ్‌ బాస్‌ లో ఎంట్రీ ఇచ్చి సెలబ్రెటీ అయిన గణేష్‌ తాజాగా కౌశల్‌ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. కౌశల్‌ అభిమానులు ప్రత్యేకం ఏమీ కాదని - బిగ్‌ బాస్‌ పార్టిసిపెంట్స్‌ ప్రతి ఒక్కరికి కూడా అభిమానులు ఉన్నారు - కౌశల్‌ అభిమానుల గురించి ప్రత్యేకంగా ఏమీ లేదు అంటూ గణేష్‌ వ్యాఖ్యలు చేశాడు. ప్రతి పార్టిసిపెంట్‌ కు సోషల్‌ మీడియాలో ఆర్మీ తయారు అయ్యిందని కూడా గణేష్‌ అన్నాడు.

గణేష్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో కౌశల్‌ ఆర్మీ విమర్శలు చేస్తున్నారు. గణేష్‌ పై తీవ్ర స్థాయిలో కౌశల్‌ ఆర్మీ దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యంలో కొందరు మాత్రం గణేష్‌ కావాలని కౌశల్‌ పై విమర్శలు చేస్తున్నాడు. ఆమద్య కత్తి మహేష్‌ కావాలని పవన్‌ పై విమర్శలు చేసి ఎలా ఫేమస్‌ అయ్యాడో ఇప్పుడు కౌశల్‌ పై విమర్శలు చేయడం ద్వారా గణేష్‌ ఫేమస్‌ అవ్వాలని కోరుకుంటున్నట్లుగా అనిపిస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో నటించాలనే కోరికతో గణేష్‌ ఇలాంటి పాపులారిటీని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కౌశల్‌ ను విమర్శించడం వల్ల మీడియాలో ఫోకస్‌ అవ్వొచ్చు, అప్పుడు సినిమాల్లో ఆటోమేటిక్‌ గా అవకాశాలు వస్తాయి అనేది గణేష్‌ ఆలోచన కావొచ్చు అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.