Begin typing your search above and press return to search.
ఆ వ్యవహారం తప్ప ఇంకేమీ లేదా మాట్లాడటానికి: మహిళా సింగర్ ఫైర్!
By: Tupaki Desk | 19 Sep 2022 11:00 AM GMTసింగర్ సునీత తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చక్రవర్తి, మహేశ్వరి హీరోహీరోయిన్లుగా వచ్చిన గులాబీ చిత్రంలో.. ఈ వేళలో నువ్వు ఏం చేస్తు ఉంటావో అంటూ అద్భుతమైన టైమ్‌లెస్ మెలోడీతో అందరిని తన వైపుకు తిప్పుకున్నారు... సునీత. ఓవైపు గాయనిగా, మరోవైపు డబ్బింగ్ కళాకారిణిగా, ఇంకోవైపు వివిధ టీవీ షోలకు జడ్జిగా ఇలా బహుముఖ రూపాల్లో తన ప్రతిభను చాటుకుంటున్నారు.. సునీత. అంతేకాకుండా హీరోయిన్లకు తీసిపోని అందంతో కవ్వించే సునీతకు సోషల్ మీడియాలో భారీ ఎత్తున అభిమానులు కూడా ఉన్నారు.
గతంలో ఓ వ్యక్తిని పెళ్లాడి అతడితో విడాకులు తీసుకున్న సునీతకు పెళ్లీడుకొచ్చిన కొడుకు, కూతురు ఉన్నారు. అయినా సునీత వయసు కేవలం 42 ఏళ్లే. గతేడాది మ్యాంగో మ్యూజిక్ చానెల్ అధినేత రామ్ వీరపనేనితో సునీత ఏడడగులు వేసిన సంగతి తెలిసిందే. ఈ వివాహంపై అప్పట్లో భారీ ఎత్తున ట్రోలింగ్ నడిచింది.
దీనిపై ఒక యూట్యూబ్ చానెల్ తాజా ఇంటర్వ్యూలో యాంకర్.. సునీతను ప్రశ్నించింది. దీనిపై సునీత ఫైరయ్యారు. తాను కొన్ని వందల సినిమా పాటలు పాడానని, 121 మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పానని వాటిని వదిలేసి జనాలు తన వ్యక్తిగత వ్యవహారాలపై ఎందుకు దృష్టిపెడుతున్నారని సునీత నిప్పులు చెరిగింది. మాట్లాడుకోవడానికి ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు నా పర్సనల్ జీవితం మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? సంస్కారవంతుల లక్షణం ఏంటంటే.. మనిషిని ఒకమాట అనేముందు ఒక్క క్షణం ఆలోచించాలి అంటూ క్లాస్ పీకింది. ప్రస్తుతం సునీత చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
వ్యక్తిగతంగా తాను సున్నిత మనస్కురాలినని... ఇష్టమైనవారు ఎవరైనా చిన్నమాటంటే కన్నీళ్లు పెట్టుకుంటానని సునీత తెలిపారు. తన కుమార్తె, కుమారుడు కోరిన మీదటే.. వారి కోరిక మేరకే రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకున్నానని చెప్పారు. రామ్ తనను ప్రశాంతంగా ఉంచుతారని.. జీవితం ఆయన చెంత సంతోషంగా గడిచిపోతోందని వెల్లడించారు.
ఇక రామ్‌తో పెళ్లి తన ఇష్టమన్నారు. ఆ పెళ్లిపై వచ్చిన విమర్శలను తాను పట్టించుకోనని తెలిపారు. తాను తీసుకున్న నిర్ణయం మంచిది, చెడ్డది అని చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు. పనిపాట లేని వాళ్లు మాత్రమే ఇలాంటి విమర్శలు చేస్తుంటారని సునీత మండిపడ్డారు. పక్కవాళ్ల జీవితాల గురించి అనవసరంగా వ్యాఖ్యలు చేసి అమూల్యమైన సమయాన్ని ఎందుకు వృథా చేసుకుంటారో తనకు అర్థం కావడం లేదన్నారు.
గతంలో తన వ్యక్తిగత జీవితంలో ఎదురయిన ఆటుపోట్లతో డిప్రెషన్‌కు గురయ్యానని సునీత షాకింగ్ విషయాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అయితే ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఒక మెంటార్‌లా వ్యవహరించి తనను డిప్రెషన్ నుంచి బయటపడేశారని తెలిపారు. బాలు ఒక అద్భుతమైన వ్యక్తి అని సునీత కొనియాడారు. ప్రతి సమస్యను ఎదుర్కొనేలా ఆయన తనను తీర్చిదిద్దారని తెలిపారు.
1999లో విడుదలైన 'పెళ్లిపందిరి' కోసం మొదటిసారి హీరోయిన్ రాశికి డబ్బింగ్ చెప్పానని సునీత తెలిపారు. ఇప్పటివరకూ.. సౌందర్య, రాశి, నయనతార, కమలినీ ముఖర్జీ, కల్యాణి, లయ, సోనాలిబింద్రే.. ఇలా మొత్తం 121 మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పానన్నారు. ప్రస్తుతం 'పొన్నియిన్ సెల్వన్'లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కు కూడా డబ్బింగ్ చెప్పానని వెల్లడించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.