Begin typing your search above and press return to search.
'రంగ్ దే' ముందు చాలా పెద్ద టార్గెట్ ఉందిగా..!
By: Tupaki Desk | 24 March 2021 8:33 AM GMTనితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన 'రంగ్ దే' సినిమా విడుదలకు ముస్తాభయ్యింది. ఈ సినిమా ప్రమోసన్ వీడియోలు మరియు ట్రైలర్ టీజర్ లు సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా నితిన్ మరియు కీర్తి సురేష్ ల మద్య ఉండే ఫన్నీ మరియు ఎమోషనల్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్ముతున్నారు. దాంతో ఈ సినిమాను భారీ మొత్తంలో బయ్యర్లు కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ భారీగా ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను నైజాం ఏరియాకు గాను రూ.7.6 కోట్లు.. సీడెడ్ లో రూ.3.6 కోట్లు... ఆంధ్రాలో రూ.10 కోట్లు ఇతర ప్రాంతాల్లో రూ.2.7 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. మొత్తంగా ఈ సినిమా దాదాపుగా 24 కోట్ల బిజినెస్ ను చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధించాలంటే రూ.24.5 కోట్ల రూపాయలను వసూళ్లు చేయాల్సి ఉంది. ఇటీవల సోలో రిలీజ్ లు కష్టంగా ఉంది. ఈ సినిమాకు కూడా చిన్న సినిమాలతో గట్టి పోటీనే ఉంది. కనుక రంగ్ దే సినిమా అంత భారీ మొత్తంను రికవరీ చేయడం అంటే మామూలు విషయం కాదు. సినిమా సూపర్ హిట్ అయితే తప్ప బ్రేక్ ఈవెన్ కాదేమో అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి నితిన్ సినిమా సక్సెస్ అయ్యి బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్లకు లాభాలను తెచ్చి పెట్టేనా అనేది చూడాలి.