Begin typing your search above and press return to search.

ఆటలో అరిచేసిన రోజులున్నాయన్న ప‌రిణీతి‌

By:  Tupaki Desk   |   16 March 2021 11:30 PM GMT
ఆటలో అరిచేసిన రోజులున్నాయన్న ప‌రిణీతి‌
X
బ్యాడ్మింట‌‌న్ క్రీడాకారిణిగా రాణించాలంటే క‌ఠోరంగా శ్ర‌మిస్తే స‌రిపోదు. సుశిక్షితులైన కోచ్ ల స‌హాయం అవ‌స‌రం. రేయింబ‌వ‌ళ్లు క‌ఠిన‌మైన ధీక్ష‌‌ త‌ప‌న‌తో ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. దేశ‌విదేశాల నుంచి బ‌రిలో దిగే వ‌ర‌ల్డ్ క్లాస్ క్రీడాకారుల‌‌తో పోటీప‌డుతూ నెగ్గుకు రావాల్సి ఉంటుంది. అందుకోసం భార‌తీయ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఎంత‌గా శ్ర‌మించారో తెలిసిందే.

అయితే అంత పెద్ద చాంపియ‌న్ ని త‌ల‌పిస్తూ త‌నలానే ఆడాలంటే దానికోసం ఒక మామూలు సినీ న‌టి ఎంత‌గా శ్ర‌మించాల్సి ఉంటుందో అర్థం చేసుకోవాలి. క్రీడా నేప‌థ్యం లేక‌పోయినా బ్యాడ్మింటన్ ఆడాలంటే ఎంత క‌ఠిన‌త‌ర‌మైన‌దో స‌న్నివేశం ఊహించండి. కానీ సైనాలా క‌నిపించేందుకు ప‌రిణీతి చోప్రా చాలానే శ్ర‌మించారు. నిరంత‌రం రాకెట్ చేత‌ప‌ట్టి బ్యాడ్మింట‌న్ ప్రాక్టీస్ చేసిన వైనం.. లుక్ ప‌రంగా మేకోవ‌ర్ ట్రై చేయ‌డం వ‌గైరా వ‌గైరా శ్ర‌మ ఫోటోలు వీడియోల రూపంలో ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది.

ఇటీవ‌ల రిలీజ్ చేసిన స్ఫూర్తివంత‌మైన `సైనా` టీజ‌ర్ తో మ‌రింత‌గా క్లారిటీ వ‌చ్చేసింది. సైనా నెహ్వాల్ గా ఆట‌లో అడుగు పెట్టడం పరిణీతి చోప్రాకు అంత తేలికైన విష‌య‌మేం కాదు. ఈ చిత్రం ఏస్ ఇండియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ జ‌ర్నీ నేప‌థ్యంలోనిది కాబ‌ట్టి.. దానికోసం క‌ఠోరంగా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. అచ్చంగా సైనాని త‌ల‌పిస్తూ సైనా చిత్రంలో త‌న‌ ఆత్మతో ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల ఔత్సాహిక క్రీడాభిమానుల్ని ప్రేరేపించింది. ఈ చిత్రానికి భారతీయ అంతర్జాతీయ క్రీడా సోదరభావం నుండి భారీ మద్దతు లభించినప్పటికీ ఈ ప్రయాణం క‌ఠిన‌త‌ర‌మైన‌ద‌ని ప‌రిణీతి అన్నారు. అథ్లెట్ కావడానికి మాన‌సికంగా శారీర‌కంగా ఎంతో ప్రిప‌రేష‌న్ అవసరమ‌ని త‌న అనుభ‌వాన్ని పారీ తెలిపారు.

అసాధార‌ణ‌ నైపుణ్యం ఉంటేనే ఒలింపియన్ కాగ‌ల‌రు. ఎంతో చురుకుదనం.. పనితీరు .. వేగం కోసం నెలల త‌ర‌బ‌డి క‌ఠిన‌మైన‌ శిక్షణను తీసుకున్న పరిణీతి త‌న అనుభ‌వాల్ని తాజాగా వెల్ల‌డించారు.సైనా లాగా నటించడం మాత్రమే కాదు.. సైనాగా మారడానికి ఆమె చేసిన ప్రయత్నంలో కఠినమైన శిక్షణ పొందారు. ఆటాడే కోర్టులో బ్లాస్ట్ అవ్వాలి. విపరీతమైన అలసటను ఎదుర్కోవాలి. అయినప్పటికీ సైనాను నేను అనే ఆలోచన ద్వారా ప్రేరణ పొందార‌ట‌. ప్రతి భారతీయుడు గ‌ర్వించ‌ద‌గిన స్ఫూర్తివంత‌మైన బ్యాడ్మింటన్ స్టార్ జ‌ర్నీ ఎలా సాగిందో చూసేందుకు జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని సైనా చెబుతున్నారు.

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రాకెట్ క్రీడ బ్యాడ్మింటన్. ఒలింపియన్ లా ఆడటానికి కొన్ని గొప్ప‌ నైపుణ్యాలు అవసరం. కోర్టులో నా మొదటి రోజున నేను గ్రహించింది ఏమంటే.. నేను అరిచేసిన రోజులు ఉన్నాయి. కొన్ని సార్లు ఇది ఇక‌ చేయలేను! అని డీలా ప‌డిపోయాను. అయితే ఈ మూవీ చూసేందుకు వ‌చ్చే మిలియన్ల మంది ప్రజలు గుర్తుకొచ్చారు. నేను తిరిగి లేవ‌డానికి పున‌రుజ్జీవం పొంద‌డానికి అదే ప్రేర‌ణ‌గా నిలిచింది.. అని పారీ తెలిపారు.టి-సిరీస్ భూషణ్ కుమార్ తో క‌లిసి క్రిషన్ కుమార్ ఫ్రంట్ ఫుట్ పిక్చర్స్- సుజయ్ జైరాజ్ - రాసేష్ షా సంయుక్తంగా నిర్మించిన సైనా 20 మార్చి 2021 న విడుదలవుతోంది.