Begin typing your search above and press return to search.
బిబి4 : కరాటే కళ్యాణి ఎలిమినేట్?
By: Tupaki Desk | 19 Sep 2020 2:30 PM GMTబిగ్ బాస్ సీజన్ 4 రెండవ వారంలో ఏకంగా 9 మంది ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. 9 మందిలో అతి తక్కువ ఓట్లు వచ్చింది కరాటే కళ్యాణికే అంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కరాటే కళ్యాణికి సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోయింగ్ లేదు. దానికి తోడు ఆమె షో లో ఉన్న తీరు కూడా ఆమె ఎలిమినేట్ అవ్వడానికి కారణం అయ్యి ఉంటుందని అంటున్నారు. మొదటి వారంలోనే ఆమె ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అప్పుడే ఎలిమినేట్ అయ్యి సూర్య కిరణ్ సేఫ్ అయ్యేవాడు. కాని ఆమె లక్కీగా మొదటి వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకుంది.
రెండవ వారంలో ఆమె ఎలిమినేషన్ నుండి బయట పడుతాను అనే నమ్మకంతో స్వయంగా తనకు తాను బోట్ దిగేసింది. కాని ఆమెకు ప్రేక్షకుల్లో ఉన్న వ్యతిరేకత తెలియలేదు. ఆమెను ఓటింగ్ లో అస్సలు ఎవ్వరు పట్టించుకోలేదు అనేది టాక్. ఆమెకు అతి తక్కువ ఓట్లు వచ్చాయంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కరాటే కళ్యాణి ఎలిమినేట్ కు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వారం రెండు ఎలిమినేషన్ లు అంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయంపై రేపటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
గంగవ్వను వీకెండ్ లో పంపించే అవకాశం ఉందనుకున్నారు. ఆమె ఆరోగ్యం అలాగే సీరియస్ గా ఉంటే ఆమె ఉండలేకుంటే ఆమెను నిర్వాహకులు సాదరంగా పంపించే అవకాశం ఉందనుకున్నారు. కాని ప్రోమోలో చూస్తుంటే ఆమె బాగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆమె మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.