Begin typing your search above and press return to search.
డ్రగ్స్ వివాదం కారణంగా సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూ పడిపోనుందా...?
By: Tupaki Desk | 28 Sep 2020 5:33 PM GMTబాలీవుడ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు అనేక మలుపులు తిరిగి చివరకు డ్రగ్ ఇష్యూ దగ్గర ఆగింది. ఈ డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ లో ఒక చీకటి కోణం అని చెప్పవచ్చు. ఇది ఒక్క బాలీవుడ్ కే పరిమితం కాకుండా శాండిల్ వుడ్ - టాలీవుడ్ లకు కూడా పాకింది. దీంతో సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ వ్యవహారం అనేది మాయని మచ్చగా మిగిలిపోతోంది. ఇప్పటికే ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు హీరోయిన్ రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. మరోవైపు శాండిల్ వుడ్ లో నటీమణులు రాగిణి - సంజన లను బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. ఇక స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే - సారా అలీఖాన్ - శ్రద్ధా కపూర్ - రకుల్ ప్రీత్ సింగ్ లను ఎన్సీబీ అధికారులు విచారించారు. ఈ కేసులో ఇంకా వారికి క్లీన్ ఛీట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో హీరోయిన్ల బ్రాండ్ వాల్యూ పడిపోతుందేమో? అడ్వర్టైజ్ ఒప్పందాలు చేసుకున్నవారు బాండ్స్ బ్రేక్ చేసుకుంటారేమో? అని సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకుంటున్నారు.
బాలీవుడ్ లో వివాదాల్లో చిక్కుకున్న సెలబ్రిటీల బ్రాండ్ వేల్యూ పడిపోవడం అనేక సందర్భాలలో చూసాం. కొన్నిసార్లు ఒక వివాదాస్పద కామెంట్ వలన కూడా వారిని బ్రాండ్ అంబాసిడర్ నుంచి దూరం చేసిన సందర్భాలు ఉన్నాయి. స్టార్ హీరో అమీర్ ఖాన్ వివాదాస్పదమైన 'అసహనం' కామెంట్స్ చేసిన తర్వాత అతను స్నాప్ డీల్ ఒప్పందాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అలానే సల్మాన్ ఖాన్ ని సైతం థంబ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించారు. ఎందుకంటే ఏ బ్రాండ్ అయినా కస్టమర్స్ ని వదులుకోవడం కంటే అంబాసిడర్ ని తొలగించడానికే మొగ్గు చూపుతుంది. బ్రాండ్ అంబాసిడర్ కారణంగా బ్రాండ్ వాల్యూ పెరగాలని కోరుకుంటారే కానీ తగ్గించుకోవాలని ఎవరూ ఆలోచించరు. ఈ నేపథ్యంలో ఇప్పుడు డ్రగ్స్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న స్టార్స్ అందరూ తమ బ్రాండ్ వాల్యూని కోల్పోతారేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
డ్రగ్స్ కేసులో ఇవి ఆరోపణలు మాత్రమే అయినప్పటికీ.. ఇది అంతో ఇంతో వారిపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. దీని కారణంగా అందరూ బాలీవుడ్ సెలబ్రిటీలను పక్కన పెట్టి స్పోర్ట్స్ స్టార్స్ ని బ్రాండ్ అంబాసిడర్స్ గా పెట్టుకోడానికి ముందుకొస్తారు అని అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ఎక్కడైనా ఏ ఇష్యూ అయినా కొన్నేళ్ల పాటు మాత్రమే నడుస్తుంది. ఈ గ్యాప్ లో ఆ స్టార్ బ్రాండ్ వాల్యూ పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇంతకముందు చెప్పుకున్న అమీర్ ఖాన్ - సల్మాన్ ఖాన్ లనే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం వీరిద్దరూ పలు బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చారు. అలానే ఇప్పుడు డ్రగ్ ఆరోపణలు ఎదుర్కుంటున్న వారి విషయంలో కూడా జరిగే అవకాశం లేకపోలేదని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.