Begin typing your search above and press return to search.
ఆ సినిమాకు 2.6 కోట్ల వ్యూస్
By: Tupaki Desk | 19 Aug 2017 6:11 PM GMTప్రస్తుతం యూట్యూబ్ లో సినిమాలు చూసేవారు చాలా ఎక్కువైపోయారనే చెప్పాలి. బాషా ఏదైనా పర్వాలేదు సినిమా కంటెంట్ బావుంటే చాలు వీక్షకులు వాటిపైనే ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు. ముఖ్యంగా తెలుగు-తమిళ్ సినిమాల్లో యాక్షన్ తరహా సీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని హిందీలో కూడా డబ్ చేసుకొని ప్రసారం చేస్తున్నాయి కొన్ని బాలీవుడ్ చానళ్లు. అంతే కాకుండా యూట్యూబ్ లో కూడా అప్ లోడ్ చేస్తుండడంతో వాటిని హిందీ ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు.
ఇప్పుడు అదే తరహాలో తమిళ హీరో విజయ్ సినిమాను హిందీ ప్రేక్షకులు ఇష్టంగా చూస్తున్నారు. తమిళ్ లో అట్లీ దర్శకత్వంలో "తెరి" అనే సినిమాను తెలుగులో 'పోలీసోడు' టైటిల్ తో దిల్ రాజు సమర్పణలో రిలీజ్ చేశారు. విజయ్ సరసన సమంత నటించింది. 2016 లో విడుదలైన ఈ సినిమా విజయ్ కెరీర్ లో ది బెస్ట్ చిత్రంగా నిలిచి మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాను హిందీ డబ్బింగ్ వెర్షన్ జులై 1న యూట్యూబ్ లో విడుదలైంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఇప్పటివరకు ఏ తమిళ హీరోకు రాని వ్యూస్ విజయ్ హిందీ డబ్బింగ్ సినిమాకు వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం 2.6 కోట్ల మంది హిందీ వెర్షన్ ను వీక్షించారు.
దీన్ని బట్టి చుస్తే డబ్బింగ్ సినిమాల స్టామినా అక్కడ ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.. కానీ విజయ్ తమిళ్ లో ఎంత పెద్ద బాక్స్ ఆఫీస్ హిట్ ను అందుకున్నా ఇతర భాషల్లో తన మార్కెట్ ను సెట్ చేసుకోలేకపోతున్నారు. కార్తీ- సూర్య- విక్రమ్ వంటి హీరోలకి ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. ఇక రజినీ కాంత్ -కమల్ హాసన్ వంటి వారి గురించి ప్రేత్యకంగా చెప్పనక్కర్లేదు. అయితే విజయ్ కూడా ఆ స్థాయిలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు పోలీస్ సినిమాతో హిందీ వీక్షకులకు దగ్గరైన ఆ హీరో మరో సినిమాతో ఆకట్టుకుంటాడో లేదో చూడాలి. ప్రస్తుత ఈ హీరో అట్లీ దర్శకత్వంలోనే ' మెర్సల్' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. అక్టోబర్ 18న ఆ సినిమాను విడుదల చేయనున్నారు ఆ చిత్ర నిర్మాతలు.