Begin typing your search above and press return to search.

విజ‌య్ తెరి తెలుగు టైటిలేంటంటే..

By:  Tupaki Desk   |   25 March 2016 3:58 PM GMT
విజ‌య్ తెరి తెలుగు టైటిలేంటంటే..
X
కోయిల ముందే కూసేసింది. త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్ కొత్త సినిమా ‘తెరి’ తెలుగు వెర్ష‌న్ టైటిల్ అనుకున్న దాని కంటే ఒక రోజు ముందే బ‌య‌టికి వ‌చ్చేసింది. ఈ చిత్రానికి ‘విన్న‌ర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తెరిని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులోకి తీసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఐతే గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా తెర‌కెక్క‌బోతున్న సినిమాకు ‘విన్న‌ర్’ అనే టైటిల్ అనుకుంటున్న‌ట్లు రెండు రోజుల కింద‌టే వార్త‌లొచ్చాయి. ఇంత‌లో దిల్ రాజు త‌న సినిమాకు అదే టైటిల్ ఫిక్స్ చేయ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. మ‌రి వాళ్ల‌కు, రాజుకు మ‌ధ్య ఏం ఒప్పందం కుదిరిందో ఏంటో? శ‌నివారం ‘విన్న‌ర్’ లోగోతో పాటుగా ట్రైల‌ర్ కూడా రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఆల్రెడీ ‘విన్న‌ర్’ డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు కూడా వేగంగా సాగిపోతున్నాయి. తమిళంతో పాటుగా ఏప్రిల్ 14నే తెలుగు వెర్ష‌న్ కూడా రిలీజ్ చేయాల‌ని ఫిక్స‌య్యాడు రాజు. తెలుగులోకి కూడా అనువాద‌మై మంచి విజ‌యం సాధించిన ‘రాజా రాణి’ మూవీ ఫేమ్ అత్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. రెండో చిత్రానికే విజ‌య్ లాంటి సూప‌ర్ స్టార్ తో ప‌ని చేసే అవ‌కాశం కొట్టేసిన అత్లీ.. ఈ అవ‌కాశాన్ని బాగానే స‌ద్వినియోగం చేసుకున్నాడ‌ని టీజ‌ర్‌ - ట్రైల‌ర్ చూస్తే అంద‌రికీ అర్థమైంది. విజ‌య్ ఇందులో పోలీస్ గానే కాక‌.. మ‌రో భిన్న‌మైన అవ‌తారంలోనూ క‌నిపిస్తున్నాడు. స‌మంత క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాకు జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీత ద‌ర్శ‌కుడు. తుపాకి.. జిల్లా.. సినిమాల‌తో తెలుగులో ఓ మోస్త‌రుగా ఫాలోయింగ్ సంపాదించుకున్న విజ‌య్‌.. ‘విన్న‌ర్’తో మ‌రింత‌గా ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు చేరువ కావాల‌ని ఆశిస్తున్నాడు.