Begin typing your search above and press return to search.

ఆర్యన్ పక్కాగా ఫాలో కావాల్సిన 14 నిబంధనలు ఇవే

By:  Tupaki Desk   |   30 Oct 2021 4:12 AM GMT
ఆర్యన్ పక్కాగా ఫాలో కావాల్సిన 14 నిబంధనలు ఇవే
X
బాలీవుడ్ బాద్షా షారుక్ కుమారుడుకు ఎంత పెద్ద కష్టం వచ్చిందో తెలిసిందే. నిషేధిత డ్రగ్స్ కలిగి ఉన్నాడన్న ఆరోపణల నేపథ్యంలో అతనిపై కేసు నమోదు కావటమే కాదు.. జైలుపాలు కావటం తెలిసిందే. పోలీసుల అదుపులోకి వెళ్లిన క్షణం నుంచి అతడి బెయిల్ కోసం షారుక్ దంపతులు చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఎన్నిసార్లు కోర్టు గడప తొక్కినా ఫలితంలో మాత్రం మార్పు రాని పరిస్థితి.

దీంతో.. షారుక్ కుటుంబం తీవ్రమైన వేదనలో మునిగిపోయింది. మొత్తంగా అతడి ప్రయత్నం ఫలించటం.. తాజాగా బెయిల్ మంజూరు కావటం తెలిసిందే. బెయిల్ మంజూరు అయినప్పటికీ ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదల కాకపోవటానికి కారణం.. బెయిల్ కు సంబంధించిన సాంకేతిక అంశాల్ని పూర్తి చేయకపోవటమే. దాదాపుగా 24 రోజులు జైల్లో ఉన్న అతడు.. శనివారం బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇచ్చిన సందర్భంగా కోర్టు అతడికి పలు కండీషన్లు పెట్టింది. తాము విధించిన నిబంధనల్ని ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరించింది. మొత్తం 14 కండీషన్లతో న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు ఓకే చేసింది. ఇంతకూ ఆ పద్నాలుగు షరతులు ఏమిన్నది చూస్తే..

- రూ.లక్ష వ్యక్తిగత బాండ్ చెల్లించాలి

- ఎన్ డీపీఎస్ న్యాయస్థానం వద్ద పాస్ పోర్టును సరెండర్ చేయాలి

- ఒకరు లేదంటే ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు సమర్పించాలి.

- ప్రత్యేక కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి పెట్టి వెళ్లరాదు

- గ్రేటర్ ముంబయి దాటి బయటకు వెళ్లాలంటే దర్యాప్తు అధికారికి సమాచారం ఇవ్వాలి

- బయటకు వెళ్లే విషయాన్ని చెప్పటంతో పాటు.. ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలియజేయాలి

- డ్రగ్స్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు

- నిందితుడిగా ఉన్న తన స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ తో పాటు.. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేయకూడదు.

- ఈ కేసు విచారణకు భంగం వాటిల్లేలా వ్యవహరించకూడదు.

- ఈ కేసులో సాక్ష్యుల్ని.. ఆధారాల్ని ప్రభావితం చేయకూడదు

- ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదు

- ప్రతి శుక్రవారం ఎన్ సీబీ ఆఫీసుకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్యలో హాజరు కావాలి

- ఎన్ సీబీ అధికారులు విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలి

- కోర్టు విచారణకు అన్ని తేదీల్లో హాజరు కావాలి

- కేసు విచారణను ఆలస్యం చేసేలా ప్రవర్తించకూడదు