Begin typing your search above and press return to search.

94వ ఆస్కార్ వీరులు వీరే!

By:  Tupaki Desk   |   28 March 2022 10:30 AM GMT
94వ ఆస్కార్ వీరులు వీరే!
X
సినిమా రంగంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే 94వ ఆస్కార్ అవార్డుల ప్ర‌ధానోత్స‌వం కార్య‌క్ర‌మం లాస్ ఎంజెల్స్ లోని డాల్బీ థియేట‌ర్లో ఘ‌నంగా జ‌రిగింది. అంగ‌రంగ వైభంగా జ‌రిగిన వేడుక‌ల్లో హాలీవుడ్ తారలంతా సంద‌డి చేసారు. మొత్త 23 విభాగాల్లో అవార్డ‌లు అంద‌జేసారు. క‌రోనా కార‌ణంగా రెండేళ్ల‌గా ఈ కార్య‌క్ర‌మం నీర‌సించింది. గ్యాల‌రీ లో ప్రేక్ష‌కులు లేకుండా అవార్డుల కార్య‌క్ర‌మాన‌ల్ని తూతూ మంత్రంగా కానిచ్చారు.

కానీ ఈసారి ప‌రిస్థితులు అందులో ఉండ‌టంతో వేడుక‌ సోమ‌వారం అట్ట‌హ‌సంగా జ‌రిగింది. మొత్తం 23 విభాగాల్లో అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. 'ది ప‌వ‌ర్ ఆఫ్ డాగ్' చిత్రం ఏకంగా 12 విభాగాల్లో నామినేట్ అయింది. 'డ్యూన్' 10విభాగాల్లో..'వెస్ట్ సైడ్ స్టోరీ'..'బెల్ ఫాస్ట్' చిత్రాలు ఏడు విభాగాల్లో అవార్డులు ఎగ‌రేసుకుపోయాయి.

మరోవైపు బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫిచర్‌ విభాగంలో పోటీపడిన భారతీయ చిత్రం 'రైటింగ్‌ విత్‌ ఫైర్‌'కు నిరాశే ఎదురైంది. ఈ అవార్డును 'సమ్మర్‌ ఆఫ్‌ సోల్‌' కైవసం చేసుకుంది. ఉత్త‌మ న‌టుడిగా విల్ స్మిత్ (కింగ్ రిచ‌ర్స్డ్).. ఉత్త‌మ న‌టిగా జెస్సీకా చ‌స్టేన్ ( ది ఐస్ ఆఫ్ స్టోరీ) ..ఉత్త‌మ స‌హాయ న‌టిగా ట్రాయ్ కోట్స‌ర్ (CODA)..ఉత్త‌మ చిత్రంగా చైల్డ్ ఆఫ్ అడ‌ల్స్ట్ (CODA) నిలిచాయి.

టెక్నిక‌ల్ విభాగం నుంచి ఉత్తమ ద‌ర్శ‌కుడిగా జేన్ కాంపియ‌న్( ది ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్) నిలిచారు. అలాగే ఉత్త‌మ సిన‌మాటోగ్ర‌ఫార్ గా గ్రేగ్ ప్ర‌జెన్ (డ్యూన్)..ఉత్త‌మ ఒరిజిన‌ల్ సాంగ్ గా 'నో టైమ్ టూ డై'.. బె స్ట్ అడాప్టెడ్ స్ర్కీన్ ప్లే CODA(షాన్ హెడెర్)..ఇంకా బెస్ట ఒరిజిన‌ల్ స్ర్కీన్ ప్లే విభాగంలో బెల్ ఫాస్ట్ ( కెన్న‌త్ బ్రానా)కి అవార్డులు ద‌క్కాయి. ఇంకా అవార్డ‌ల తాలుకా పూర్తి వివ‌రాలు క్రింద ఇవ్వ‌బ‌డ్డాయి.

*ఉత్తమ చిత్రం - చైల్డ్‌ ఆఫ్‌ డెఫ్‌ అడల్ట్స్‌ (CODA)
* ఉత్తమ నటుడు - విల్‌ స్మిత్‌ (కింగ్‌ రిచర్డ్‌)
* ఉత్తమ నటి - జెస్సికా చస్టేన్‌ (ద ఐస్‌ ఆఫ్‌ టామీ ఫే)
* ఉత్తమ దర్శకురాలు - జేన్‌ కాంపియన్‌ (ది పవర్‌ ఆఫ్‌ ద డాగ్‌)
* ఉత్తమ సహాయ నటి - అరియానా దిబోస్‌ (వెస్ట్‌ సైడ్‌ స్టోరీ)
* ఉత్తమ సహాయ నటుడు - ట్రాయ్‌ కోట్సర్‌ (CODA)
* ఉత్తమ సినిమాటోగ్రఫీ - గ్రెగ్‌ ఫ్రెజర్‌ (డ్యూన్‌)
* బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ - నో టైమ్‌ టు డై
* బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫియేచర్‌ - సమ్మర్‌ ఆఫ్‌ సోల్‌
* బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే- CODA (షాన్‌ హెడర్‌)
* బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే - బెల్‌ఫాస్ట్‌ (కెన్నత్‌ బ్రానా)
* బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ - జెన్నీ బీవన్‌ (క్రూయెల్లా)
* బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫియేచర్‌ - డ్రైవ్‌ మై కార్‌ (జపాన్‌)
* బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫియేచర్‌ - ఎన్‌కాంటో
* బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ - హన్స్‌ జిమ్మర్‌ (డ్యూన్‌)
* బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ - డ్యూన్‌ (పాల్‌ లాంబర్ట్‌, ట్రిస్టన్‌ మైల్స్‌, బ్రియన్‌ కానర్‌, గెర్డ్‌ నెఫ్‌జర్‌)
* బెస్ట్‌ ఫిలిం ఎడిటింగ్‌ - జో వాకర్‌ (డ్యూన్‌)
* బెస్ట్‌ సౌండ్‌ - డ్యూన్‌ (మాక్‌ రుత్‌, మార్క్‌ మాంగిని, థియో గ్రీన్‌, డగ్‌ హెంఫిల్‌, రాన్‌ బార్ట్‌లెట్‌)
* బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ - డ్యూన్‌ (ప్రొడక్షన్‌ డిజైన్‌- పాట్రైస్‌ వెర్మట్‌, సెట్‌ డెకరేషన్‌- జుజానా సిపోస్‌)
* బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌స్టైలింగ్‌ - ద ఐస్‌ ఆఫ్‌ ది టామీ ఫే (లిండా డౌడ్స్‌, స్టెఫనీ ఇన్‌గ్రామ్‌, జస్టిన్‌ రాలే)
* బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం: ది లాంగ్‌ గుడ్‌బై
* బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం: ది విండ్‌షీల్డ్‌ పైపర్‌
* బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం: ద క్వీన్‌ ఆఫ్‌ బాస్కెట్‌బాల్‌