Begin typing your search above and press return to search.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఓల్టేజ్ పెంచే బిగ్ మూవీస్ ఇవే!
By: Tupaki Desk | 24 March 2022 5:26 AM GMTకళ్లముందే కాలం మారిపోతోంది .. వినోదాన్ని అందించే సాధనాలు .. విధానాలు మారిపోతున్నాయి. గతంలో ఒక సినిమా విడుదలైన తరువాత అది టీవీల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయం పట్టేది. ఆ తరువాత కొన్ని నెలలలోగానే ఛానల్స్ లో రావడం మొదలుపెట్టాయి. ఏదో ఒక పండుగ సందర్భంలో కొత్త సినిమాలు ఎంట్రీ ఇచ్చేవి. కానీ ఓటీటీలు వచ్చిన తరువాత అంత సమయం తీసుకోవడం లేదు. ఎంత భారీ సినిమా అయినా .. ఎంత బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయినా అగ్రిమెంట్ ప్రకారం నెల తిరగ్గానే ఏదో ఒక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ప్రత్యక్షమవుతున్నాయి.
ఇంతకుముందు శుక్రవారం రాగానే ఏ థియేటర్లలో ఏ సినిమా ఉందనేది చూసుకునేవారు. ఇప్పుడు ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఏ సినిమాలు వచ్చాయనేది చూసుకుంటున్నారు. ప్రపంచంలోని సినిమాలన్నిటికీ ఇప్పుడు అరచేతిలోని స్మార్ట్ ఫోన్ అద్దంలా మారిపోయింది. అందువలన ఓటీటీ సినిమాలకు అంతకంతకూ ఆదరణ పెరిగిపోతూ వస్తోంది. ఈ వారంలో చాలా సినిమాలు ఆయా ఓటీటీ వేదికలపై హడావిడి చేయనున్నాయి. ఆ జాబితాలో ముందుగా 'భీమ్లా నాయక్' కనిపిస్తోంది. పవన్ - రానా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లను రాబట్టింది. ఈ నెల 25వ తేదీ నుంచి 'ఆహా'లోను .. హాట్ స్టార్ లోను స్ట్రీమింగ్ కానుంది.
ఇక శర్వానంద్ - రష్మిక జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నెల 25వ తేదీ నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా, ఓటీటీ నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే రోజున 'వలిమై' జీ 5 ద్వారా పలకరించనుంది.
అజిత్ హీరోగా వినోద్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ మూవీలో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించాడు. తమిళంలో ఓకే అనిపించుకున్న ఈ సినిమా, మిగతా భాషల్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇక సూర్య - ప్రియాంక మోహన్ కాంబినేషన్లో వచ్చిన 'ఈటి' థియేటర్ల నుంచి మంచి వసూళ్లను రాబట్టడంలో విఫలమైంది. ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా రానుంది. 'గంగూబాయి' కూడా నెట్ ఫ్లిక్స్ ద్వారానే పలకరించనుంది. ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో 100 కోట్లకి పైగా కొల్లగొట్టిన ఈ సినిమాకి, 'ఓటీటీ ద్వారా కూడా మంచి రెస్పాన్స్ రావొచ్చని భావిస్తున్నారు.
ఇక ఇదే రోజున నెట్ ఫ్లిక్స్ తో పాటు హాట్ స్టార్ లోను '83'ని వదులుతున్నారు. రణ్ వీర్ సింగ్ - దీపిక నటించిన ఈ సినిమా థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయింది. ఓటీటీ రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది చూడాలి మరి. ఇక ఈ నెల 11న వచ్చిన 'రాధేశ్యామ్' కూడా ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పై కనిపించే అవకాశాలు ఇన్నాయనే ఒక టాక్ అయితే బలంగానే వినిపిస్తోంది.