Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీ, థియేట‌ర్ల‌లో హంగామా వీటిదే!

By:  Tupaki Desk   |   1 Nov 2022 3:30 AM GMT
ఈ వారం ఓటీటీ, థియేట‌ర్ల‌లో హంగామా వీటిదే!
X
బాక్సాఫీస్ వ‌ద్ద చిన్ని సినిమాల‌తో పాటు క్రేజీ మూవీస్ పోటీప‌డ‌బోతున్నాయి. ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసిన సినిమాలు కొన్ని ఓటీటీకి రెడీ అవుతుండ‌గా.. మ‌రి కొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లోకి రావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇందులో అత్య‌ధికంగా చిన్న సినిమాలే వుండ‌టం గ‌మ‌నార్హం. ఇక ఓటీటీల్లోకి ప‌లు క్రేజీ సినిమాలు, భారీ బ‌డ్జెట్ మూవీస్ రాబోతున్నాయి. థియేట‌ర్ల‌లో కొన్ని హిట్ అనిపించుకుంటూఏ మ‌రి కొన్ని ప‌ర‌వాలేద‌నిపించుకున్నాయి. అవేంటో ఇప్ప‌డు చూద్దాం.

సంతోష్ శోభ‌న్, చిట్టి ఫ‌రియా అబ్దుల్లా జంట‌గా న‌టించిన `లైక్ షేర్ అండ్ స‌బ్స్ స్క్రైబ్‌`. మేర్ల‌పాక గాంధీ రూపొందించిన ఈ మూవీ న‌వంబ‌ర్ 4న థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. ఇద్దరు యూట్యూబ‌ర్ ల జ‌ర్నీ నేప‌థ్యంలో సాగే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా ఈ మూవీని మేర్ల‌పాక గాంధీ తెర‌కెక్కించాడు. ఈ మూవీ స‌క్సెస్ సంతోష్ శోభ‌న్, ఫ‌రియా అబ్దుల్లా తో పాటు ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీకి చాలా అవ‌స‌రం. దీంతో ఈ ముగ్గురు ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

ఇక అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్ క‌లిసి న‌టించిన రొమాంటిక్ మూవీ `ఊర్వ‌శివో రాక్ష‌సివో`. రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ లో నిర్మించారు. గ‌త కొంత కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్ ల‌కు ఈ మూవీ అత్యంత కీల‌కంగా మారింది. ఈ మూవీని న‌వంబ‌ర్ 4న థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్నారు. వీరి త‌ర‌హాలోనే నందు, ర‌ష్మీ గౌత‌మ్ కూడా `బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్‌` కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ కూడా న‌వంబ‌ర్ 4న థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది.

క‌న్న‌డ సినిమా `బ‌నార‌స్‌` న‌వంబ‌ర్ 4న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ద్వారా కొత్త జంట జైద్ ఖాన్‌, సోనాల్ ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ మూవీతో వీరి కెరీర్ ఆధార‌పడి వుంది. జ‌య‌దీర్థ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా బి. అంజ‌నీష్ లోక్ నాథ్ నిర్మించారు. న‌వీన్ చంద్ర హీరోగా న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `త‌గ్గేదే లే`. `దండు పాల్యం` ఫేమ్ శ్రీ‌నివాస‌రాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీని న‌వంబ‌ర్ 4న రిలీజ్ చేస్తున్నారు. మ‌శ్చ‌కారుల జీవ‌న ప్ర‌యాణం నేప‌థ్యంలో రూపొందిన మూవీ `జెట్టీ`. నందితా శ్వేత న‌టించిన ఈ మూవీ న‌వంబ‌ర్ 4న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఇక వీటీతో పాటు జాన్వీ క‌పూర్ న‌టించిన స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ `మిలి` రిలీజ్ కాబోతోంది.

ఇక ఇదే రోజున ఓటీటీలో భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో హాలీవుడ్ మూవీ `ఇన్ సైడ్ మ్యాన్ అక్టోబ‌ర్ 31న రిలీజ్ అవుతోంది. నాగ్ న‌టించిన `ది ఘోస్ట్` న‌వంబ‌ర్ 2న స్ట్రీమింగ్ కానుంది. ఇదే రోజున కిల్ల‌ర్ సాలీ, న‌వంబ‌ర్ 4న ఎనోలా హోమ్స్ 2, మేనిఫెస్ట్ సీజ‌న్ 2, లుకీసీమ్, దావిడ్‌, న‌వంబ‌ర్ 5న బుల్లెట్ ట్రైన్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక హాట్ స్టార్ లో ర‌ణ్ బీర్ క‌పూర్ `బ్రహ్మాస్త్ర‌` న‌వంబ‌ర్ 4న , ప్రైమ్ వీడియో లో న‌వంబ‌ర్ 4న `పొన్నియ‌న్ సెల్వ‌న్ 1`, ఆహాలో అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె ఎపిసోడ్ 3 స్ట్రీమింగ్ కాబోతోంది. సోనీ లీవ్ లో `ఆయుమ్ క‌ల‌వుమ్‌` న‌వంబ‌ర్ 4 స్ట్రీమింగ్ కాబోతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.