Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఇవే..!
By: Tupaki Desk | 2 May 2022 10:32 AM GMTఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ప్లాప్ అవుతుందో సినీ పండితులు కూడా చెప్పలేరు. ఒక్కోసారి మంచి కంటెంట్ తో తీసిన సినిమాలు కూడా పరాజయం చవిచూస్తుంటే.. ఇంకోసారి రొటీన్ కమర్షియల్ మూవీస్ తీసినా సక్సెస్ అవుతుంటాయి.
కొన్ని క్రేజీ కాంబినేషన్స్ సినీ అభిమానుల్లో భారీ అంచనాలు తీసుకొస్తాయి. రికార్డుల ఖాయమని బలమైన నమ్మకాన్ని కలిగిస్తాయి. తీరా సినిమా విడుదలయ్యాక కనీస ఆదరణ దక్కించుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికల పడుతుంటాయి. మరికొన్ని చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై భారీ వసూళ్లను రాబడుతుంటాయి.
సక్సెస్ - ఫెయిల్యూర్ అనేవి ఆ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ ఆధారంగా నిర్ణయిస్తారనే సంగతి తెలిసిందే. మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బయ్యర్లకు డబ్బు తెచ్చిపెట్టకపోతే ఈ మూవీని ప్లాప్ కిందే పరిగణిస్తారు. ఇది ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలోనే కనిపిస్తుంటుంది.
ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు పరాజయం పాలైనప్పుడు అధిక నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో నిర్మాతలు బయట పడినా.. ఆశించిన స్థాయిలో రిటర్న్స్ రాకపోతే కొనుగోలుదారులే పీకల్లోతు కష్టాల్లో పడే పరిస్థితి వస్తుంది.
టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్స్ గా మిగిలిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తెలుగులో బాక్సాఫీస్ వద్ద చతికిల పడి.. నష్టాలు తెచ్చిపెట్టిన స్టార్ హీరోల సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం…!
* 'రాధేశ్యామ్' : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ లవ్ డ్రామా.. భారీ అంచనాలతో 2022 మార్చి 11న విడుదలై, బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 90 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
* 'అజ్ఞాతవాసి' : ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో సిల్వర్ జూబ్లీ మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2018 సంక్రాంతి కానుకగా విడుదలై నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చింది. హసినీ అండ్ హారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా 66 కోట్లు నష్టం తెచ్చిపెట్టింది. అంతేకాదు కాపీ వివాదాన్ని కూడా మూటగట్టుకొని త్రివిక్రమ్ కి చెడ్డ పేరు తెచ్చింది.
* 'స్పైడర్' : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ దర్శకుడు మురగదాస్ తెరకెక్కించిన ద్విభాషా చిత్రమిది. 2017లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. మహేష్ కెరీర్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన సినిమాగా నిలిచింది. ఈ చిత్రానికి 59 కోట్ల వరకూ నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించింది.
* 'సాహో' : ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. 'బాహుబలి' తర్వాత డార్లింగ్ చేసిన సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అయితే వాటిని అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు దాదాపు 52 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. అయితే ఈ మూవీ హిందీలో 100 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం.
* 'ఎన్టీఆర్ కథానాయకుడు' : నందమూరి తారకరామారావు బయోపిక్ గా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా మొదటి భాగం ఇది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. బాలయ్య స్వీయ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా 50 కోట్లు నష్టం వచ్చేలా చేసింది.
* 'ఎన్టీఆర్ - మహానాయకుడు' : ఇది ఎన్టీఆర్ బయోపిక్ లో రెండో భాగం. విబ్రి మీడియా - NBK ప్రొడక్షన్ - వారాహి చలన చిత్ర సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ పరాజయం పాలైంది. ఈ సినిమాకు 45 - 47 కోట్లు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.
* చిరంజీవి నటించిన 'సైరా నరసింహా రెడ్డి' (43 కోట్ల నష్టం) - మహేష్ బాబు '1 నేనొక్కడినే' (42 కోట్లు నష్టం) మరియు 'బ్రహ్మోత్సవం' (38.8 కోట్లు నష్టం) - పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' (37 కోట్ల లాస్) సినిమాలు నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాల జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ప్రస్తుత ట్రెండ్ చూస్తే 'ఆచార్య' సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లిస్టులో 2వ స్థానంలో నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
* 'ఆచార్య' : మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల కంపెనీ సంయుక్తంగా నిర్మించాయి. శుక్రవారం (ఏప్రిల్ 29) గ్రాండ్ గా రిలీజైన ఈ మల్టీస్టారర్ కు మిశ్రమ స్పందన వచ్చింది. దానికి తగ్గట్టుగా వస్తోన్న వసూళ్లను బట్టి ఈ సినిమా భారీ నష్టాలను తెచ్చిపెడుతుందని అంచనా వేస్తున్నారు.