Begin typing your search above and press return to search.

అరవిందలో అందరి పాత్రలిలా!!

By:  Tupaki Desk   |   9 Oct 2018 2:30 PM GMT
అరవిందలో అందరి పాత్రలిలా!!
X
తెలుగు ప్రేక్షకుల్లో.. టాలీవుడ్ లో ఒకే మాట ఒకే టాపిక్.. 'అరవింద సమేత'. మిగతా అన్నీ టెంపరరీగా పక్కకు వెళ్ళాయి. అరవింద సమేత లో ఐదో పాట అలా ఉంది.. సిక్స్ ప్యాక్ స్టొరీ ఇది.. రాజీవ్ కనకాల ఎన్టీఆర్ ఫ్యాన్ ను కాలర్ ఉందా అని అడిగాడు.. ఇలా సాగుతూ ఉంది. ఇదిలా ఉంటే 'అరవింద సమేత' సినిమాలో నటీనటుల పాత్రల తీరుతెన్నుల గురించి కూడా చర్చలు సాగుతున్నాయి. సెన్సార్ అయిన తర్వాత కొంత ఇన్ఫో అయితే బయటకు వచ్చిందని ప్రచారం సాగుతుంది. అది నిజమో కాదో సినిమా రిలీజ్ అయిన తర్వాత గానీ కన్ ఫామ్ చేసుకోలేం.

అలా అని అసలు మాట్లాడుకోకుండా ఉంటే మనం వెనకబడిపోతాం.. తాజా ఇన్ఫర్మేషన్ తెలియదు. అందుకే ప్రచారంలో ఉన్న సంగతులు కాబట్టి వాటిపై ఓ లుక్కేద్దాం. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర వీర రాఘవుడు అని తెలుసు కదా. కడప కుర్రాడయినా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా హైదరాబాద్ లో ఉంటాడు. ఇక సునీల్ హైదరాబాద్ లో ఒక ఆటో గ్యారేజ్ నడుపుతూ ఉంటాడట. పాపం బయటకు అమాయకం గా కన్పించే తారకరాముడిని తన దగ్గరే ఉంచుకుంటాడట.

జగపతి బాబు కడపలో కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టు.. నవీన్ చంద్ర జగపతి బాబు కొడుకు. విలన్ సంగతి ఇలా ఉంటే.. హీరోయిన్ ఫాదర్ నరేష్. లాయర్ గా తన క్లయింట్లను ఫుల్లుగా వాడుతూ కామెడీ పంచుతాడట. నరేష్ కు కూతురు పూజా హెగ్డే తో పాటుగా ఒక కొడుకు కూడా ఉంటాడట. ఇక ఇవి కాకుండా రావు రమేష్.. జగపతి బాబు వైఫ్.. హీరో ఇంట్లో లేడీసు.. స్క్రీన్ నిండా జనాలేనట.