Begin typing your search above and press return to search.

2021 గోల్డెన్ గ్లోబ్స్ లో ప్ర‌ద‌ర్శించే సౌత్ చిత్రాలివే

By:  Tupaki Desk   |   16 Dec 2020 3:30 AM GMT
2021 గోల్డెన్ గ్లోబ్స్ లో ప్ర‌ద‌ర్శించే సౌత్ చిత్రాలివే
X
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2021 సంగ‌తులు హీట్ పెంచేస్తున్నాయి. ఈసారి ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డ్స్ లో ప్ర‌ద‌ర్శించే సౌతిండియ‌న్ సినిమాలేవి? అంటే తాజాగా వివ‌రం తెలిసింది. జల్లికట్టు(మ‌ల‌యాళం)-అసురాన్- సూరరై పోట్రు (ఆకాశం నీ హ‌ద్దురా) చిత్రాల్ని.. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2021 లాస్ ఏంజెల్స్ లో ప్రదర్శిస్తున్నారు.

LA లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2021 లో ఒకటి కాదు మూడు చిత్రాలు ప్రదర్శించబడటం దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు గర్వకారణం. ఈ అంతర్జాతీయ అవార్డుల కార్యక్రమంలో ప్రదర్శించే మూడు చిత్రాలలో ధనుష్ అసురన్ ప్ర‌త్యేక స్థానం ద‌క్కించుకుంది. వెట్రిమారన్ దర్శకత్వం వహించగా.. కలైపులి ఎస్.తాను నిర్మించిన ఈ చిత్రం పూమాని నవల వెక్కై ఆధారంగా రూపొందించారు.

అసురన్ 2019 లో అతిపెద్ద తమిళ విజయాలలో ఒకటి. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా ఆర్జించింది. వెట్రిమారన్ అనేక జాతీయ చలన చిత్ర అవార్డులను గెలుచుకున్నారు. ఇప్పుడు అతని చిత్రం అంతర్జాతీయంగా పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించ‌డం గర్వకారణం.

మరోవైపు లాక్ డౌన్ లో ఒటిటి ప్లాట్ ఫాంపై విడుదలైన సూర్య - సూరరై పోట్రు చ‌క్క‌ని ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్- 2021 లో కూడా చోటు దక్కించుకుంది. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎయిర్ డెక్క‌న్ అధినేత కెప్టెన్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెర‌కెక్కింది. విమర్శకుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న చిత్ర‌మిది. వాస్తవానికి పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు దీనిని 2020 బెస్ట్ మూవీగా ప్రకటించారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం సమకూర్చారు.

మూడ‌వ‌ది.. లిజో జోస్ పెల్లిస్సేరీ తెర‌కెక్కించిన ఆస్కార్ నామినేటెడ్ మలయాళ చిత్రం `జల్లికట్టు` కూడా గోల్డెన్ గ్లోబ్ అవార్డులతో పాటు అనేక ఇతర కాంపిటీష‌న్స్ లో అధికారికంగా ప్రవేశించింది. `మావోయిస్టు` పేరుతో ఎస్ హరీష్ రాసిన చిన్న కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించిన ఈ హర్రర్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీలో ఆంటోనీ వర్గీస్- చెంబన్ వినోద్ జోస్- సబుమోన్ అబ్దుసామద్ - శాంతి బాలచంద్రన్ త‌దిత‌రులు న‌టించారు.

గోల్డెన్ గ్లోబ్స్ 2021 ఉత్తమ విదేశీ చిత్ర పురస్కారం కేట‌గిరీలో ..వీటితో పాటు తన్హాజీ - లూడో- ఎబ్ అల్లాయ్ ఊ- ది డిసిపిల్ చిత్రాల్ని ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.