Begin typing your search above and press return to search.
హీరోలు లేకుండా సత్తా చాటే హీరోయిన్లు వీళ్లే!
By: Tupaki Desk | 22 Nov 2022 12:30 AM GMTహీరో ఇమేజ్ నుంచి ప్రేక్షకులంతా సంపూర్ణంగా బయటపడుతోన్న తరుణమిది. కంటెంట్ కి ఇచ్చినంత ప్రాధాన్యత హీరో విషయంలో పెద్దగా కనిపించడం లేదు. చిన్న సినిమాలు సైతం కోట్ల వసూళ్లు సాధించడంతో? స్టార్ హీరో సినిమాలో కథ ఎక్కడటుంది? అని ఓ విశ్లేషణ స్థాయికి ఆడియన్ చేరుకున్నాడు అన్నది సుస్పష్టం. అందుకే మ్యాటర్ ఉన్న నిర్మాతంలా కథల్ని నమ్ముకుని సినిమాలు చేయండి .
కాంబినేషన్స్ కాదు...హీరో అనే ఇమేజ్ అంతకన్నా కాదూ అంటూ కొత్త నినాదాన్ని సైతం తెరపైకి తెస్తున్నారు. ఇక కాస్త పేరున్న హీరోయిన్లకి సరైన లేడీ ఓరియేంటెడ్ చిత్రం పడితే బాక్సాఫీస్ నే శాషిస్తున్నారు. ప్రస్తుత జనరేషన్ టాలవుడ్ హీరోయిన్లలో ఆ క్రేజ్ సమంత....కీర్తి సురేష్..సాయి పల్లవికి ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే సమంత క్రేజీ భామగా దూసుకుపోతుంది.
కొన్ని లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లోనూ నటించింది. ఇటీవలే 'యశోద'తో ప్రేక్షకుల ముందుకొచ్చి పర్వా లేదనినిపించింది. అలాగే 'మహానటి' తో బాక్సాఫీస్ వద్ద సత్తాచాటిన కీర్తి సురేష్ కి ఆ చరిష్మా ఉంది. ఓవైపు హీరోయిన్ గా నటిస్తూనే అవకాశం వచ్చినప్పుడు లేడీ ఓరియేంటెడ్ కథల్లోనూ నటిస్తోంది. ఇక సాయి పల్లవి అదే తీరున కొనసాగుతోంది.
తెలుగులో స్ర్టెయిట్ లేడీ ఓరియేంటెడ్ సినిమా చేయలేదు గానీ.. కోలీవుడ్ లో కొన్ని ప్రయత్నాలు చేసింది. కానీ ముగ్గురికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా వాళ్లు ఇంకా ఆ స్థాయి హైట్స్ ని అందుకోలేదని చెప్పాలి. ముగ్గురుకి జనాల్ని థియేటర్ కి రప్పించే సత్తా ఉంది. అంతటి ఛరిష్మా వాళ్లసొంతం. ఒక్కొక్కరి లో ఒక్కో రేర్ క్వాలిటీ ఉంది. పల్లవిలో డాన్సింగ్ స్కిల్స్ సహా నేచురల్ పెర్పార్మెన్స్ అమ్మడికి పెద్ద అస్సెట్.
అలాగే సమంత నటన కి సైతం అంతే ఫాలోయింగ్ ఉంది. ఇక కీర్తి సురేష్ చలాకీ తనంతో కుర్రాళ్లని ఆకట్టుకోగలదు. నటిగా ఆమె గురించి చెప్పాల్సిన పనిలేదు. తన ట్యాలెంట్ అంతా మహానటిలోనే చూపించింది.
కొత్తగా ఆమె గురించి చెప్పాల్సింది లేదు. ఈ ముగ్గురికి కావాల్సింది కేవలం సరైన కథలు మాత్రమే. వాళ్ల ఇమేజ్ కి తగ్గ కథ..పాత్రలు కుదిరితే బాక్సాఫీస్ని దున్నేయడం ఖాయం. ఈ ముగ్గురు గనుక పర్పెక్ట్ గా ట్రాక్ లోకి రాగలిగితే టాలీవుడ్ సక్సెస్ రేట్ కూడా మరింత మెరుగ్గా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.