Begin typing your search above and press return to search.
'ఖిలాడి' ఫస్టు డే వసూళ్లు ఇవే!
By: Tupaki Desk | 12 Feb 2022 11:30 AM GMTక్రితం ఏడాది ఆరంభంలో 'క్రాక్' తో సంచలన విజయాన్ని నమోదు చేసిన రవితేజ, ఈ ఏడాది మొదట్లోనే 'ఖిలాడి'ని థియేటర్లలోకి దింపేశాడు. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకి రమేశ్ వర్మ దర్శకత్వం వహించాడు. రవితేజ స్టైలీష్ లుక్ .. మాస్ కంటెంట్ .. ఇద్దరు భామలతో రొమాన్స్ .. ఆయన ఎనర్జీ లెవెల్స్ కి తగిన పాటలు ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ వెళ్లాయి. పోస్టర్స్ నుంచే అందరిలో ఆసక్తిని పెంచుతూ వచ్చిన ఈ సినిమా, భారీ స్థాయిలో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోను రవితేజ మార్క్ సినిమా అనిపించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు వసూళ్ల విషయానికి వస్తే, నైజామ్ లో ఈ సినిమా 1.86 కోట్ల షేర్ ను రాబట్టింది.
ఇక ఏపీలో 1.88 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఏరియాల వారీగా చూసుకుంటే, నైజామ్ 1.86 కోట్లు .. సీడెడ్ 56 లక్షలు .. వైజాగ్ 46 లక్షలు .. ఈస్ట్ 26 లక్షలు .. వెస్ట్ 21 లక్షలు .. కృష్ణా 18 లక్షలు .. గుంటూరు 56 లక్షలు .. నెల్లూరు 21 లక్షల షేర్ ను రాబట్టింది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నైట్ జార్ఫ్యు అమల్లో ఉంది .. అందువలన సెకండ్ షోస్ కి అనుమతి లేదు. ఇక మిగిలిన ఆటలన్నీ కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో నడవాల్సిందే. మరో వైపున టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈ సినిమా ఇక్కడ ఈ స్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టడం విశేషమేనని చెబుతున్నారు. రెండు రాష్ట్రాల్లోను కలుపుకుని ఈ సినిమా తొలి రోజున 4.30 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక పాజిటివ్ టాక్ రావడం వలన, వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
రవితేజ సినిమాలకి మాస్ ఆడియన్స్ వెంటనే కనెక్ట్ అవుతుంటారు. టైటిల్ నుంచి కంటెంట్ వరకూ మాస్ కి కనెక్ట్ అయ్యేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటాడు. కథ ఏ అంశం చుట్టూ తిరిగినా, తన సినిమాకి వచ్చే మాస్ ఆడియన్స్ నిరాశతో వెనుదిరగకూడదనే ఉద్దేశంతోనే రవితేజ ఉంటాడు.
ఎక్కడ ఎంత మాత్రం మాస్ అంశాలు తగ్గకుండా చూసుకుంటాడు. అలా తన బాడీ లాంగ్వేజ్ కి తగిన మాస్ మసాలా అంశాలతో ఆయన రావడం వల్లనే ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోందని అంటున్నారు. ఇక బలమైన తారాగణం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్లిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.