Begin typing your search above and press return to search.
ప్రస్తుతం ఖచ్చితంగా చూడాల్సిన ఓటిటి మూవీస్ ఇవేనట..!
By: Tupaki Desk | 21 May 2021 2:30 AM GMTకరోనా మహమ్మారి ఎప్పుడైతే దేశంలో కల్లోలం సృష్టించిందో అప్పటినుండి అంతటా సినిమా థియేటర్స్ మూతపడిపోయాయి. ఈ ఏడాది కాస్త ఊపిరి పీల్చుకుందాం అనుకునే లోపల కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. ఈసారి మరింత డేంజర్ గా వ్యాప్తి చెందుతూ ప్రాణాలు బలి తీసుకుంటుంది. కానీ గతేడాది కాలంగా థియేటర్స్ బంద్ అయినప్పటి నుండి ఇప్పటివరకు జనాలకు ఎంటర్టైన్మెంట్ మాత్రం కేవలం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారానే అందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓటిటిలు ఎప్పుడైతే సినిమాలు కొనుగోలు చేసి థియేటర్స్ లో మిస్ అయిన సినిమాలను లేదా కొత్తగా రిలీజ్ అయినటువంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయో అప్పటినుండి ఓటిటిలకే ఓటేస్తున్నారు జనాలు.
అయితే ఈ మధ్యకాలంలో అన్ని రొటీన్ జానర్ లలో కాకుండా డిఫరెంట్ ఐడియాలతో ఆనాటి వాతావరణం క్రియేట్ చేస్తూ సినిమాల్లో ఆ ఎమోషన్స్ విజయవంతంగా తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ ఏడాది ఓటిటిల ద్వారా జనాలకు బాగా దగ్గరైన సినిమాలు - విశేషమైన ప్రేక్షకాదరణ పొందుతున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో దృశ్యం సీక్వెల్ ఉంది. అయితే ఆ సినిమా ఆల్రెడీ వివిధ భాషల్లో రీమేక్ అవుతూనే ఉంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ ఏడాది ఖచ్చితంగా బెస్ట్ ఫిల్మ్స్ అనిపించుకున్న సినిమాల్లో తమిళ - మలయాళం సినిమాలున్నాయి. ముఖ్యంగా రెండు సినిమాలు ఇండియా మొత్తం ప్రేక్షకుల నోట్లో నానుతున్నాయి.
ఒకటి తమిళ స్టార్ ధనుష్ నటించిన కర్ణన్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఓ దళిత గ్రామం - తక్కువ కులం పేరిట ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది.. ఏ విధంగా అన్యాయానికి గురయ్యారు అనే అంశాలపై సినిమా తెరకెక్కింది. అద్భుతమైన కథాకథనాలతో పాటు సినిమాలో నటీనటుల అద్భుతమైన యాక్టింగ్ తో సినిమాను మరో ఎత్తులో నిలబెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా(అమెజాన్ ప్రైమ్ లో) ఖచ్చితంగా చూడాల్సిన సినిమాల లిస్ట్ లో చేరింది. అలాగే ఈ సినిమాతో పాటు మలయాళం పొలిటికల్ సెటైరికల్ మూవీ నయట్టు. అధికారంలో ఉన్నటువంటి రాజకీయనేతలు వారి సొంత ప్రయోజనాల కోసం వ్యవస్థలో సామాన్యులను ఎలా వాడుకుంటారు అనే అంశం పై డైరెక్టర్ మార్టిన్ ప్రకట్ ఈ సినిమా రూపొందించాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా(నెట్ ఫ్లిక్స్ లో) కూడా ఈ ఏడాది మస్ట్ వాచ్ మూవీస్ లిస్టులో చేరింది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్స్ గా మారాయి.