Begin typing your search above and press return to search.

ఈ వారం థియేట‌ర్‌..ఓటీటీలో పోటీప‌డేవి ఇవే!

By:  Tupaki Desk   |   30 Jun 2022 2:39 PM GMT
ఈ వారం థియేట‌ర్‌..ఓటీటీలో పోటీప‌డేవి ఇవే!
X
ఈ వారం థియేట‌ర్ టు ఓటీటీల్లో విడుద‌ల‌వుతున్న సినిమాల లిస్ట్ భారీగానే వుంది. కోవిడ్ కార‌ఫంగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తున్న సినిమాల‌న్నీ లైన్ క‌ట్టేసి కుదిరితే థియేట‌ర్ .. కుద‌ర‌క‌పోతే ఓటీటీ బాట ప‌ట్టేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ వారం థియేట్రిక‌ల్ రిలీజ్ మూవీస్ లిస్ట్ కంటే ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ అయిన వాటి లిస్తే భారీగా వుంది. ఏవీ ఓటీటీకి వెళుతున్నాయి?. ఏవీ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయో ఒక‌సారి చూద్దాం.

జూలై 1న దాదాపు ఏడు క్రేజీ మూవీస్ థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతున్నాయి. ఇందులో గోపీచంద్ న‌టించిన `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` కూడా ఒక‌టి. మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీపై మంచి బ‌జ్ క్రియేట్ అయింది. రాశిఖన్నా హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీని గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ల‌పై యంగ్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ మూవీ థియేట‌ర్ల‌లో జూలై 1న విడుద‌ల కాబోతోంది. ఇక ఇదే రోజు అరుణ్ విజ‌య్ హీరోగా `సింగం` సిరీస్ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌రి రూపొందించిన `ఏనుగు` త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఎక కాలంలో రిలీజ్ కాబోతోంది.

అరుణ్ విజ‌య్ కి హీరోగా, హ‌రికి ద‌ర్శ‌కుడిగా ఈ మూవీ ఓ ప‌రీక్ష‌గా మారింది. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ మూవీ ఫ‌లితంపై నే వీరి కెరీర్ ఆధార‌ప‌డి వుంది. ఇక ఇదే రోజు మాధ‌వ‌న్ న‌టించి డైరెక్ట్ చేసిన `రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్‌` రిలీజ్ అవుతోంది. దేశ ర‌క్ష‌ణ కోసం పాటుప‌డిన ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయ‌ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంపై కూడా భారీ అంచ‌నాలే వున్నాయి. ఇక `క‌బాలీ` ఫేమ్ సాయి ధ‌న్సిక కీల‌క పాత్ర‌లో న‌టించిన రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ `షికారు` కూడా ఇదే రోజు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది.

శ్రీ‌రామ్‌, అవికా గోర్ జంట‌గా న‌టించిన `టెన్త్ క్లాస్‌` జూలై 1నే థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది. ఇక ఈ సినిమాల‌తో పాటు `రాష్ట్ర‌క‌వ‌చ్ ఓమ్` కూడా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది. ఇక జూలై 1న ఓటీటీలో 14 సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయాయి. ఆహా ఓటీటీ లో `అన‌న్యాస్‌ టుటోరియ‌ల్‌` స్ట్రీమింగ్ కాబోతోంది. రెజీనా, నివేదితా స‌తీష్ కీ రోల్స్ పోషించారు. పావ‌నీ గంగిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సైకో థ్రిల్ల‌ర్ ని బాహుబ‌లి నిర్మాత‌లు ఆర్కామీడియాపై నిర్మించారు.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన `విరాట‌ప‌ర్వం` నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి స‌ద్ధ‌మైంది. రానా , సాయి ప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల రూపొందించిన ఈ మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకున్నా బాక్సాఫీస్ వ‌ద్ద రాణించ‌లేక‌పోయింది. ఇక ఇదే ఓటీటీలో ఎక్స్ట్రార్డినరీ అటార్నీ ఊ ఇన్ప‌టికే స్ట్రీమింగ్ మొద‌లైంది. స్ట్రేంజ‌ర్ థింగ్స్ వాల్యూమ్ 4 జూలై 1న స్ట్రిమింగ్ కానుండ‌గా, ఆప‌రేష‌న్ రోమియో జూలై 3 న స్ట్రిమింగ్ కాబోతోంది.

ఇక అమెజాన్ ప్రైమ్ లో బాంగ్ బాంగ్ బేబీ జూన్ 30 నుంచే స్ట్రీమింగ్ మొద‌లైంది. జూలై 1న స‌మ్రాట్ పృథ్వీరాజ్‌, ది టెర్మిన‌ల్ లిస్ట్ స్ట్రీమింగ్ కానున్నాయి. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో జూన్ 29 నుంచే `బే మ్యాక్స్‌` స్ట్రీమింగ్ మొద‌లైంది. జీ5 లో కంగ‌నా ర‌నౌత్ `ధాక‌డ్‌`, సోనా మ‌హాపాత్ర డాక్యుమెంట‌రీ `ష‌ట్ అప్ సోనా` స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక ఊట్ లో `డియ‌ర్ విక్ర‌మ్‌`, మ్యాక్స్ ప్లేయ‌ర్ లో `ఈఎల్ డాండీ`, `మియా బీవీ ఔర్ మ‌ర్డ‌ర్` స్ట్రీమింగ్ కానున్నాయి.