Begin typing your search above and press return to search.

‘మా’ ఎన్నికలు: విష్ణు, ప్రకాష్ ప్యానల్స్ ఇవే.. విజేత ఎవరు?

By:  Tupaki Desk   |   9 Oct 2021 1:37 PM GMT
‘మా’ ఎన్నికలు: విష్ణు, ప్రకాష్ ప్యానల్స్ ఇవే.. విజేత ఎవరు?
X
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA)ఎన్నికలకు రంగం సిద్ధమైంది. విమర్శలు, ప్రతి విమర్శలతో హైఓల్టేజ్ డ్రామా నడుస్తోంది. మా వార్ కు రేపటితో ముగింపు పడబోతోంది. మా బాక్సింగ్ రింగులో ప్రస్తుతం ఇద్దరు పోటీపడుతున్నారు. రేపు విజేత ఎవరో తేలిపోతుంది.

మా ఎన్నికల్లో ప్రధానంగా ప్రకాష్ రాజ్ తోపాటు మంచు విష్ణు పోటీపడుతున్నారు. ఈ రెండు ప్యానళ్లు తాజాగా చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటుకు నోటు సహా వ్యూహా ప్రతివ్యూహాల్లో మునిగిపోయారు. ఎన్నికల్లో విజయం కోసం శ్రమిస్తున్నారు.

1993 అక్టోబర్ 4న మా ’ ఏర్పాటైంది. చిరంజీవి, మురళీ మోహన్, అక్కినేని, కృష్ణ, కృష్ణంరాజుల ఆలోచనతో ‘మా’ జీవం పోసుకుంది. చంద్రబాబు నాడు ముఖ్యమంత్రిగా మా కార్యాలయాన్ని ప్రారంభించారు. ‘మా’ తొలి అధ్యక్షులు చిరంజీవి, జనరల్ సెక్రటరీగా మురళీ మోహన్ సేవలందించారు. ఇప్పవరకు 9 మంది అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం సభ్యుల సంఖ్య 956కు చేరింది.

‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానళ్లలో ఎవరెవరు ఉన్నారో చూస్తే..

-ప్రకాష్ రాజ్ ప్యానెల్ లోని ముఖ్య సభ్యులు అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ బరిలో ఉన్నారు. ఇక జనరల్ సెక్రటరీగా జీవితా, ట్రెజరర్ గా నాగినీడు, జాయింట్ సెక్రటరీలుగా అనితా చౌదరి, ఉత్తేజ్, ఉపాధ్యక్షులుగా బెనర్జీ, హేమ, ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ ఉన్నారు.

-మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ లోని ముఖ్య సభ్యులుఅధ్యక్షుడిగా మంచు విష్ణు, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఉపాధ్యక్షులుగా మాదాల రవి, ఫృథ్వీరాజ్, ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్, ట్రెజరర్ గా శివబాలాజీ, జాయింట్ సెక్రటరీలుగా కరాటే కళ్యాణి, గౌతమ్ రాజులు ఉన్నారు.

ఇక ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ గా 17మంది ఇరు టీంల తరుపున ఉన్నారు.