Begin typing your search above and press return to search.

సురేష్ బాబు మౌనానికి ఇవే కార‌ణాలు

By:  Tupaki Desk   |   11 Dec 2022 9:30 AM GMT
సురేష్ బాబు మౌనానికి  ఇవే కార‌ణాలు
X
ఆమ‌ధ్య టిక్కెట్ ధ‌ర‌లు పెంపు..థియేట‌ర్లు పున ప్రారంభ‌వం వంటి విష‌యాల్లో టాలీవుడ్ ప్ర‌ముఖులు విజ‌య‌వాడ చుట్టూ రౌండ్లు వేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత కొద్ది రోజులుగా మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీతో వాటికో ప‌రిష్కారం దొరికింది. అటుపై ఆగ‌స్టులో జ‌రిగిన ఇండ‌స్ర్టీ బంద్..గిల్డ్ స‌మావేశాలు...ఛాంబ‌ర్ స‌మావేశాలు .. రీసెంట్ గా తెర‌పైకి వ‌చ్చిన థియేట‌ర్ల వివాదం తెలిసిందే.

అయితే వీటిలో ఎక్క‌డా నిర్మాత సురేష్ బాబు క‌నిపించ‌లేదు. అప్ప‌ట్లోనే ఆయ‌నెందుకు రావ‌డం లేద‌ని మీడియా క‌థ‌నాలు వెడెక్కించాయి. ఇష్టం లేక రాలేదా? ప్ర‌భుత్వంతో వైరం లాంటి వ్య‌వ‌హారాల్లో త‌ల ఎందుక‌ని? రాలేదా అంటూ ప్ర‌చారాలు తెర‌పైకి వ‌చ్చాయి. సోష‌ల్ మీడియాలో కూడా సురేష్ బాబు ఎలాంటి స్పంద‌న ఇవ్వ‌లేదు. దీంతో ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్తం అయ్యాయి.

తాజాగా వాట‌న్నింటికి ఒక్కొక్క‌టిగా సురేష్ బాబు వివ‌ర‌ణ‌లు ఇచ్చుకున్నారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో భిన్న‌మైన స‌మ‌స్య‌ల మీద భిన్న‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్తం అవుతుంటాయి. అందులో ఇది త‌ప్పు..ఇది స‌రైంద‌ని ఎవ‌రూ చెప్ప‌లేరు. మొన్న బాల‌య్య కూడా టికెట్ ధ‌ర‌ల పెంపుపై మీరెందుకు విజ‌య‌వాడ వెళ్ల‌లేదు అని అడిగారు. ధ‌ర‌లు పెంచ‌డం నాకు ఇష్టం లేదు.

అలా చేస్తే సినిమా మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్ల‌కి దూరం అవుతుంది అన్న‌ది నా అభిప్రాయం. కానీ కొన్ని సినిమాల‌కు పెంచితే అది మేలు. భారీ బ‌డ్జెట్ సినిమాలుంటాయి. ప‌రిమిత బ‌డ్జెట్ సినిమాలుంటాయి. రెండింటికి పెంచుకుంటూ పోతే ఎలా? అలాగే గిల్డ్ బంద్ స‌మావేశాల‌కు వెళ్ల‌లేదు. అది స‌రైన నిర్ణ‌యం అని నాకు అనిపించ‌లేదు. అందుకు వెళ్ల‌లేదు.

అక్క‌డ ఏం జ‌రుగుతోంది అన్న‌ది వేరే చ‌ర్చ‌. సంక్రాంతి సినిమాల విష‌యంలో కూడా అంతే. ఎవ‌రి సినిమాని ఆప‌లేం. ఎవ‌రైనా స‌రే ప‌రిశ్ర‌మ కంటే ముందు త‌న సినిమా ఆడాల‌ని చూసుకుంటారు. ఆ త‌ర్వాతే మిగ‌తా సంగ‌తులు. ఇందులో ఎవ‌ర్నీ త‌ప్పుబ‌ట్ట‌డానికి లేదు. ప్ర‌తి నిర్మాణ సంస్థ ఓ ప‌రిశ్ర‌మ‌లా త‌య‌రై సొంత నిబంధ‌న‌లతో ముందుకెళ్తుంది. అలాంట‌ప్పుడు ఎవ‌ర్నీ ప్ర‌శ్నించ‌లేం. ఎవ‌రి విధానాలు వాళ్ల‌కుంటాయి` అని అన్నారు. దీంతో సురేష్ బాబు వ‌చ్చిన కొన్ని ర‌కాల నెగిటివ్ క‌థ‌నాల‌కు ఇక్క‌డితో బ్రేక్ ప‌డుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.