Begin typing your search above and press return to search.

రూ.400+ కోట్ల కలెక్షన్స్ క్లబ్‌ లో సౌత్‌ ఇండియన్ సినిమాలు ఇవే

By:  Tupaki Desk   |   9 Dec 2022 4:09 AM GMT
రూ.400+ కోట్ల కలెక్షన్స్ క్లబ్‌ లో సౌత్‌ ఇండియన్ సినిమాలు ఇవే
X
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లు సాధించడం అంటే చాలా గొప్ప విషయం.. పెద్ద విషయం. కానీ ఇప్పుడు వంద కోట్ల వసూళ్లు అనేది స్టార్‌ హీరోలకు మినిమం అయ్యింది. షేర్‌ విషయాన్ని పక్కన పెడితే కచ్చితంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తేనే జనాలు సినిమాను హిట్‌ సినిమాగా పరిగణిస్తూ ఉన్నారు. బాలీవుడ్‌ లో మొదటి వంద కోట్ల సినిమా వచ్చిన సమయంలో సౌత్‌ లో 50 కోట్ల కలెక్షన్స్ ఒక అద్భుతం అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు బాలీవుడ్‌ లో కంటే సౌత్‌ లో ఎక్కువగా వంద కోట్ల సినిమాలు వస్తున్నాయి.

బాలీవుడ్‌ లో 400 కోట్లు ఆపై వసూళ్లు సాధించిన సినిమాలు ఎన్నీ అంటే ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కానీ సౌత్‌ లో మాత్రం కాస్త పెద్దదిగానే ఉంది. సౌత్‌ ఇండియన్ భాషల్లో వచ్చిన సినిమాలు వంద కోట్లు దాటి చాలా ఈజీగా రెండు వందలు.. మూడు వందల కోట్లు రాబడుతున్నాయి. సౌత్ ఇండియన్ సినిమాల్లో 400 కోట్లు అంతకు మించి వసూళ్లు సాధించిన సినిమాల గురించి ఇప్పుడు మనం చూద్దాం.

2015 లో వచ్చిన బాహుబలి సినిమా సౌత్ సినిమాల స్థాయిని అమాంతం పెంచింది. ఆ సినిమా ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్ల ను నమోదు చేసినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అక్కడ నుండి సౌత్‌ సినిమాల ప్రభంజనం మొదలు అయ్యిందని చెప్పాలి. బాహుబలి 2 కూడా భారీ వసూళ్లు నమోదు చేసింది. ఏకంగా రూ.1800 కోట్ల రూపాయల వసూళ్ల ను ఆ సినిమా నమోదు చేసింది.

రజనీకాంత్ నటించిన 2.0 సినిమా 2018 సంవత్సరంలో విడుదల అయ్యి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా దాదాపుగా 600 కోట్ల రూపాయలను ఆ సమయం లో వసూళ్లు చేసిందట. ఇక సాహో సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. కానీ బాలీవుడ్‌ లో మాత్రం సాహో అనిపించింది. అక్కడ ఇక్కడ మొత్తంగా కలిసి దాదాపుగా రూ.430 కోట్ల వసూళ్లు సాహో దక్కించుకుంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మరోసారి సౌత్‌ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. దాదాపుగా 1250 కోట్ల రూపాయలను ఆర్‌ ఆర్‌ ఆర్‌ రాబట్టిందని బాక్సాఫీస్ వర్గాల టాక్‌. ఇక ఆర్‌ ఆర్‌ ఆర్‌ కి ఏమాత్రం తగ్గకుండా కన్నడ మూవీ కేజీఎఫ్ 2 కూడా భారీగా కలెక్షన్స్ ను నమోదు చేసింది. వెయ్యి కోట్లు క్రాస్ చేసిన మరో సౌత్‌ సినిమాగా కేజీఎఫ్ 2 నిలిచింది.

ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్ ప్రేక్షకుల ముందుకు వచ్చి రూ.400 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. దాదాపుగా 500 కోట్ల రూపాయలను ఈ సినిమా రాబట్టిందనే వార్తలు వస్తున్నాయి. ఇక చిన్న సినిమాగా కన్నడం లో రూపొందిన కాంతార సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే.

కాంతార సినిమా రూ.400 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. అంతే కాకుండా అల్లు అర్జున్‌ పుష్ప సినిమా కూడా నాలుగు వందల కోట్ల వసూళ్లను నమోదు చేసింది అంటూ బాక్సాఫీస్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సౌత్‌ లో చాలా తక్కువ సమయంలోనే రూ.400+ కోట్ల జాబితా ఇంత పెద్దగా మారింది. ముందు ముందు ఈ జాబితా మరింత పెద్దగా అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.