Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కు పునీత్ ఇచ్చిన సర్ ప్రైజ్ లు ఇవీ

By:  Tupaki Desk   |   30 Oct 2021 4:05 AM GMT
ఫ్యాన్స్ కు పునీత్ ఇచ్చిన సర్ ప్రైజ్ లు ఇవీ
X
మనం ఎంతగానో అభిమానించే స్టార్ హీరో మన ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? ఆనందంతో గంతులేయడం ఖాయం. అలాంటి ఆనందాన్ని ఫ్యాన్స్ కు రూచిచూపించాడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. అలాంటి హీరో ఇప్పుడు తమ ముందు లేకపోవడాన్ని వారు జీర్ణించుకోవడం లేదు.

ప్రముఖ కన్నడ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (46 ) మరణించడం కన్నడ చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచింది. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిపడిపోయిన ఆయన్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు ఆయన్ను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా పునీత్ ప్రాణాలు దక్కలేదు.

పునీత్మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆయన మరణం కన్నడ చిత్రపరిశ్రమకు తీవ్ర లోటు అని సినీ ప్రముఖులు వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

పునీత్ రాజ్ కుమార్ తన అభిమానులతో కలిసిపోయి వారికి ఆనందాన్ని పంచుతాడు. అందుకే అతడిని అభిమానుల్లో పవర్ స్టార్ ను చేసింది. అప్పట్లో ‘యువ రత్న’ సినిమా విడుదల సందర్భంగా తన అభిమానులకు పునీత్ రాజ్ కుమార్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. అభిమానులు కెమెరా ముందు మాట్లాడుతుండగా వాళ్ల వెనుకాల నుంచి సైలెంట్ గా వచ్చి సడెన్ ఎంట్రీతో సర్ ప్రైజ్ ఇచ్చాడు. అప్పుడు ఆ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

పునీత్ రాజ్ కుమార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. పలు స్కూళ్లను దత్తత తీసుకొని వాటికి అన్నీ భరిస్తున్నాడు. ఫ్యాన్స్ కు ఎంతో చేశారు. ఇప్పుడు ఆయన మరణం వారందరినీ శోకసంద్రంలో పడేసింది.