Begin typing your search above and press return to search.

#2022 టాలీవుడ్ టాప్ 5 రిలీజ్ డేట్స్ ఇవే

By:  Tupaki Desk   |   17 Jan 2022 4:15 AM GMT
#2022 టాలీవుడ్ టాప్ 5 రిలీజ్ డేట్స్ ఇవే
X
2021 ముగింపులో రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలు టాలీవుడ్ కి ఊపిరిపోసాయి. క‌రోనా మ‌హ‌మ్మారీ భ‌య‌పెడుతున్నా కానీ.. ఈ విజ‌యాలు హోప్ ని పెంచాయి. అయితే సంక్రాంతి 2022 మాత్రం తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది. కొత్త సంవ‌త్స‌రం ఆరంభ‌మే వ‌రుస‌గా భారీ పాన్ ఇండియా చిత్రాలు రిలీజ‌వుతాయ‌ని ఆశించిన వారికి క‌రోనా రూపంలో థ్రెట్ త‌ప్ప‌లేదు. వ‌ర‌స‌గా భారీ రిలీజ్ లు వాయిదాల ఫ‌ర్వం కొన‌సాగింది. సంక్రాంతి బ‌రి నుంచి పాన్ ఇండియా చిత్రాల‌న్నీ వైదొల‌గ‌డంతో నాగార్జున‌-చైత‌న్య న‌టించిన బంగార్రాజు మాత్ర‌మే పెద్ద సినిమా కేట‌గిరీలో విడుద‌లైంది. డెబ్యూ హీరోలు నటించిన సినిమాలు విడుద‌ల‌య్యాయి.

ముందే సంక్రాంతి డేట్ ని లాక్ చేసుకుని భీమ్లా నాయ‌క్ అనూహ్యంగా పోటీనుంచి వైదొల‌గ‌డంపై చ‌ర్చ సాగింది. ఆర్.ఆర్.ఆర్ కోసం సైడివ్వ‌డం భీమ్లాకి మైన‌స్ కాగా ఇది బంగార్రాజుకు ప్ల‌స్ అయ్యింద‌న్న గుస‌గుస వినిపిస్తోంది. ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్.. ఆర్.ఆర్.ఆర్ కూడా అనూహ్యంగా సంక్రాంతి రేసు నుంచి వైదొల‌గి రిలీజ్ తేదీలు మార్చుకున్నాయి. దీంతో ఎక్క‌డా లేని క‌న్ఫ్యూజ‌న్ త‌లెత్తింది. ఈ భారీ చిత్రాల రిలీజ్ తేదీల‌పై ఇప్ప‌టికీ క్లారిటీ లేదు. మ‌రోవైపు ఆచార్య‌- కేజీఎఫ్ 2 లాంటి సినిమాల రిలీజ్ తేదీల‌పైనా క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది. దీంతో సోష‌ల్ మీడియాల్లో ఏ సినిమాల‌న్నిటినీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనే దానిపై అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇండ‌స్ట్రీ ఇన్ సైడ్ గుస‌గుస‌ల ప్ర‌కారం.. ఫిబ్ర‌వ‌రి 25న భీమ్లా నాయ‌క్ విడుద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత మార్చి 18న రాధేశ్యామ్ విడుద‌ల‌కు రెడీ అవుతుండ‌గా.. ఏప్రిల్ 1న ఆచార్య విడుద‌ల‌వుతుంది. అటుపై ఏప్రిల్ 29న అత్యంత భారీగా ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుద‌ల‌వుతుంద‌ని డేట్లు ప్ర‌చారంలోకి వ‌స్తున్నాయి. ఇక వీట‌న్నిటి త‌ర్వాత మే 13న స‌ర్కార్ వారి పాట విడుద‌లవుతుంద‌ని గెస్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 వ‌ర్సెస్ బీస్ట్ ఫిక్స‌యిన సంగ‌తి తెలిసిందే. అదే రోజు నాగ‌చైత‌న్య హిందీ డెబ్యూ మూవీ లాల్ సింగ్ చ‌ద్దా (అమీర్ ఖాన్) కూడా రిలీజ‌వుతోంది.