Begin typing your search above and press return to search.

న‌న్ను కావాల‌నే ట్రోల్ చేస్తున్నారు : కిర‌ణ్ అబ్బ‌వ‌రం

By:  Tupaki Desk   |   10 Jan 2023 12:43 PM GMT
న‌న్ను కావాల‌నే ట్రోల్ చేస్తున్నారు : కిర‌ణ్ అబ్బ‌వ‌రం
X
విభిన్న‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం. `రాజా వారు రాణీగారు` మూవీతో హీరోగా తెరంగేట్రం చేసిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఆ త‌రువాత `ఎస్‌.ఆర్‌. క‌ల్యాణ మండ‌పం` మూవీతో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న విష‌యం తెలిసిందే. ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీ హీరోగా కిర‌ణ్ అబ్బ‌వ‌రంకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ మూవీ త‌రువాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం కిర‌న్ అబ్బ‌వ‌రం మూడు సినిమాల్లో న‌టిస్తున్నాడు. అందులో త్వ‌ర‌లో రిలీజ్ కు సిద్ధ‌మ‌వుతున్న మూవీ `విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ‌`. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై యంగ్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. క‌శ్మీర ప‌ర్దేశి క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతోంది. ఈ మూవీ ద్వారా ముర‌ళీ కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మంగ‌ళ‌వారం ఈ మూవీ టీజ‌ర్ ని చిత్ర బృందం విడుద‌ల చేసింది.

టీజ‌ర్ రిలీజ్ వేడుక‌లో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని కిర‌ణ్ అబ్బ‌వ‌రం వెల్ల‌డించాడు. `ఎస్‌.ఆర్‌. క‌ల్యాణ మండ‌పం` త‌రువాత కిర‌ణ్ అబ్బ‌వ‌రం బ్యాక్ టు బ్యాక్ అవ‌కాశాల్ని సొంతం చేసుకున్నా కానీ ఆ మేర‌కు విజ‌యాల్ని మాత్రం ద‌క్కించుకోలేకపోయాడు. దీంతో ఫ్లాపుల హీరో అంటూ అత‌న్ని నెట్టింట ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇదిలా వుంటే ఓ షోలో కిర‌ణ్ అబ్బ‌వ‌రంని త‌రువాత ప‌వ‌ర్ స్టార్ నువ్వే అని హైప‌ర్ ఆది అన‌డం.. దానికి కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఓకే అ్న‌ట్టుగా థ్యాంక్స్ చెప్ప‌డంతో నెటిజ‌న్ ల‌కు అడ్డంగా బుక్క‌య్యాడు.

అప్ప‌టి నుంచి కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఏ సినిమా చేసినా.. ఎక్క‌డ మాట్లాడినా నెటిజ‌న్ లు టార్గెట్ చేస్తూ ట్రోల్ కు గురి చేయ‌డం ఆన‌వాయితీగా పెట్టుకున్నారు. తాజాగా `వాల్తేరు వీర‌య్య‌` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు, ర‌వితేజ స్టేజ్ పై మాట్లాడుకుంటున్న వీడియోని మార్ఫింగ్ చేసి చిరుకు త‌న త‌ల‌, ర‌వితేజ‌కు ఆది సాయికుమార్ త‌ల‌ని అంటించి మీమ్స్ చేయ‌డం హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రంని ఇబ్బందిపెట్టింది. దీనికి పై సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం తాజాగా `విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ‌` టీజ‌ర్ లాంచ్ లోనూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

`నేను మీకు బాగా కావాల్సిన వాడిని` సినిమా స్టార్టింగ్ లో నా పేరు కిర‌ణ్ అబ్బ‌వ‌రం అనే వుంటుంది. కానీ మీమ‌ర్స్ మాత్రం నా పేరుకు ముందు ప‌వ‌ర్ స్టార్ అని యాడ్ చేసి నెట్టింట‌ ట్రోల్ చేశారు. నేను చేయ‌క‌పోయినా నా మీద కావాల‌నే న‌న్ను ట్రోల్ చేస్తూ నెగిటివిటీని ప్ర‌చారం చేస్తున్నారు. న‌న్ను ఇండ‌స్ట్రీ నుంచి పంపించేయాల‌ని చూస్తున్నారో ఏమో తెలియ‌డం లేదు.

ఇంత వ‌ర‌కు నేను ట్రోలింగ్స్ పై స్పందించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఇలా జ‌రుగుతోంది. నేను చేయ‌ని త‌ప్పుకు న‌న్ను అన‌కండి` అంటూ ట్రోల‌ర్స్ కి కిర‌ణ్ అబ్బ‌వ‌రం గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. హీరో ఇంత క్లారిటీ ఇచ్చాక ట్రోల‌ర్స్ సైలెంట్ అవుతారా? లేక మ‌ళ్లీ రెచ్చిపోతారా అన్న‌ది వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.