Begin typing your search above and press return to search.
స్టార్ హీరోని తిట్టమని డబ్బులిచ్చారా?
By: Tupaki Desk | 3 Jun 2019 8:54 AM GMTసామాజిక మాధ్యమాల వెల్లువలో బూతు పెట్రేగుతోంది. ఇక్కడ ఎవరు ఎవరినైనా యథేచ్ఛగా తిట్టేయొచ్చు. బూతులు తిడుతూ మాటలు తూలొచ్చు. కక్ష తీర్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ విచ్చలవిడితనం అసహ్యించుకునే స్థాయికి చేరుకుంది. చెవులు- కళ్లు మూసుకోవాల్సిన సన్నివేశం సోషల్ మీడియాలో దాపురించింది. అయితే ఈ తరహా సోషల్ మీడియా బూతు పురాణం వెనక చాలానే పెద్ద గేమ్ నడుస్తుంటుందని ఇటీవల ఎన్నికల సందర్భంగా పలు సర్వేలు రివీల్ చేశాయి. రాజకీయ నాయకులు.. సినిమా వోళ్లను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు చేసే గుంపులు - బ్యాచ్ లు ఉంటాయని వాళ్లకు విడిగా పేమెంట్లు ఉంటాయని .. తెరవెనక ఈ కథంతా నడిపించే గురువులు ఉంటారని తేలింది.
అయితే ఇదే బాపతులో కండల హీరో సల్మాన్ భాయ్ పై కక్షపూరితంగా అలాంటి పనే చేస్తున్నారట. సోషల్ మీడియాలో తనని పదే పదే బూతులు తిడుతూ కించపరుస్తున్న వారిని ఐడెంటిఫై చేసిన సల్మాన్ వారిని బ్లాక్ చేయించారట. ఆ మేరకు తన సోషల్ మీడియా పోస్టింగ్స్ టీమ్ ని అలెర్ట్ చేశారని తెలుస్తోంది. అబ్యూజివ్ గా ఉండే ఫ్యాన్స్ కి ఇక అక్కడ చోటు ఉండదు. ఎవరైతే రియల్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్లకు మాత్రమే సోషల్ మీడియాలో ఇకపై రిప్లయ్ లు ఉంటాయి. వారికి అకౌంటబిలిటీ ఉంటుంది. గుర్తింపు ఉంటుంది. భాయ్ వారికి రిప్లయ్ లు ఇస్తారు. తనని ఇష్టానుసారం ఉద్ధేశపూర్వకంగా తిట్టేసేవారిని నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తారు.
అన్నట్టు సల్మాన్ భాయ్ ని తిట్టేవాళ్లు ఎవరుంటారు? ఎవరైనా కక్ష కట్టి డబ్బులిచ్చి మరీ వేరే బ్యాచ్ తో ఈ పని చేయిస్తున్నారా? అంటే అవుననే సందేహాన్ని భాయ్ వ్యక్తం చేయడం మరో సెన్సేషన్. ఎవరో డబ్బులిచ్చి ఆ పని చేయిస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో డౌట్ వ్యక్తం చేశాడు భాయ్. సోషల్ మీడియాలో తనని వ్యక్తిగతంగా.. వృత్తిగతంగా టార్గెట్ చేస్తున్నది ఎవరు? అనేది అర్థం గాక బుర్ర పీక్కుంటున్న సల్మాన్ కి ఎప్పటికీ సొల్యూషన్ కనిపించేట్టు లేదట. అందుకే ఇలాంటి వాటిని పట్టించుకోకుండా వదిలేయడమే కాదు.. కావాలని తిట్టేవారిని ఫ్యాన్స్ జాబితా నుంచి తొలగించుకోవడం ఉత్తమం అని భావిస్తున్నారట. సల్మాన్ నటించిన భారత్ రిలీజ్ ప్రమోషన్స్ లో ఇలాంటి విషయాలన్నీ ఓపెన్ అవుతున్నాయి. అన్నట్టు ఇటీవలే ప్రియాంక చోప్రాకు మద్ధతుగా నిలిచిన గాయని సోనా మొహపాత్ర సల్మాన్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఐశ్వర్యారాయ్ తోనూ భాయ్ గొడవపడ్డారు. అలాగే పోటీ ప్రపంచంలో ఎవరో ఒకరు శత్రువులు తప్పనిసరి. మరి అతడిపై కక్ష కట్టింది ఎవరో మరి!?